సందీప్ కోసం రంగం లోకి స్నేహితురాలు

0

యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. ఇటీవల `నిను వీడని నీడను నేను` చిత్రంతో విజయం అందుకున్నాడు. ఎన్నో పరాజయాల తర్వాత కాస్త ఊరట దక్కింది. ప్రస్తుతం `తెనాలి రామకృష్ణ బీఏ.బిఎల్` చిత్రం లో నటిస్తున్నాడు. ఇందులో సందీప్ కి జోడీగా ఆపిల్ బ్యూటీ హన్సిక నటిస్తోంది. ఇటీవలే రిలీజైన ప్రచార చిత్రాల కు మంచి స్పందన వచ్చింది. సందీప్ మరో సారి హిట్టు అందుకునేలా కనిపిస్తున్నాడు అంటూ ప్రశంసలు దక్కాయి. అయితే ఈ చిత్రానికి పబ్లిసిటీ మాత్రం నామ మాత్రమే.

ఇలానే ఇక పైనా కొన సాగితే సందీప్ ఆశించిన హిట్టు దక్కడం కష్టమే. ఆ యంగ్ హీరో కెరీర్ కి సరైన బ్లాక్ బస్టర్ కావాల్సిన టైమ్ ఇది. సరైన హిట్టు కొట్టి రేసు లోకి రాకపోతే కెరీర్ ప్రశ్నార్థకం అయ్యే ఛాన్స్ లేక పోలేదు. ఈ నేపథ్యం లో సందీప్ కోసం అందాల కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ రంగంలోకి దిగింది. `సందీప్ కి నా సపోర్ట్ ఉంటుంది` అంటూ సోషల్ మీడియా లో `తెనాలి రామకృష్ణ` సినిమా కు క్యాంపెయినింగ్ మొదలు పెట్టింది. అయితే రకుల్ ప్రచారం హిట్టు కి ఏమేరకు కలిసొస్తుంది అన్నది చూడాలి. మరి రకుల్ సందీప్ కి ఎందుకంత సాయం చేస్తోంది? అంటే ఆ ఇద్దరి స్నేహం ఎలాంటి దో అర్థం కావాలి.

రకుల్ కి తొలి బ్లాక్ బస్టర్ సినిమా `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` అన్న సంగతి తెలిసిందే. అందులో సందీప్ హీరో. ఆ విజయం తర్వాత ఆ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఈ విషయాన్ని చాలా ఇంటర్వూ ల్లో రకుల్ వెల్లడించింది. తనని అలా టాలీవుడ్ లో విజయ వంతంగా లాంచ్ చేసిన హీరో కాబట్టి తనకు ఫుల్ సెంటిమెంట్. అప్పటి నుంచి ఆ స్నేహాన్ని అలానే కొన సాగిస్తోంది. అప్పట్లో సందీప్ ఏ సినిమాలో నటించినా వాటికి రకుల్ తన వంతు సాయం గా ప్రచారానికి వచ్చేది. సోషల్ మీడియా వేదిక గా నిరంతరం ప్రచార సాయం చేస్తూనే ఉంది. తాజా గా తెనాలి రామ రిలీజ్ సందర్భం గా కీలక సమయం లో మరోసారి ప్రచార సాయం చేస్తోంది. ప్రస్తుతం రకుల్ కు తెలుగు లో పెద్దగా ఛాన్సుల్లేవ్. స్టార్ హీరోలెవరూ అవకాశాలివ్వడం లేదు. ఈ నేపథ్యం లో మరోసారి తనని లాంచ్ చేసిన సందీప్ సరసన నటిస్తుందా? అన్నది చూడాలి.
Please Read Disclaimer