రకుల్ మరోసారి దేదే ప్యార్ దే

0

సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకానొక సమయంలో మహేష్ బాబుతో సినిమాకు డేట్లు ఇవ్వలేనంత బిజీగా సినిమాలు చేసిన ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ డం అలా కిందకు పడిపోయింది. సినిమాల్లో మళ్లీ బిజీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడికి గత ఏడాది కలిసి రాలేదు. కాని ఈ ఏడాది మాత్రం రెండు తెలుగు సినిమాలు ఒక హిందీ సినిమాలో ఈమెకు ఛాన్స్ దక్కింది.

తెలుగులో ఈమె క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న సినిమాలో మరియు నితిన్ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇదే సమయంలో ఈమె బాలీవుడ్ లో అజయ్ దేవగన్ కు జోడీగా నటించేందుకు ఎంపిక అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. గత ఏడాది అజయ్ దేవగన్ తో దేదే ప్యార్ దే సినిమాలో నటించింది. ఆ సినిమాలో పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న అజయ్ దేవగన్ కు ప్రియురాలిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఆ సినిమాలో రకుల్ శృతి మించి అందాల ప్రదర్శణ చేసింది.

సీనియర్ స్టార్ అజయ్ దేవగన్ తో ఈ అమ్మడి రొమాన్స్ కు మంచి పేరు రావడంతో మళ్లీ వీరి కాంబో మూవీ రాబోతుంది. అజయ్ దేవగన్ నటిస్తూ నిర్మిస్తున్న ‘మే డే’ సినిమాలో రకుల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ సినిమాకు అజయ్ దర్శకత్వం వహించబోఉన్నాడు. దేదే ప్యార్ దే హిందీలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో రకుల్ అండ్ టీం ఉంది. మే డే సక్సెస్ అయితే బాలీవుడ్ లో రకుల్ బిజీ అవుతుందేమో చూడాలి.