అతిలోక సుందరిలా రకుల్

0

బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ జోరు టాలీవుడ్ లో ఈమధ్య కాస్త తగ్గింది. తమిళంలో.. హిందీలో మాత్రం ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. అయినా రకుల్ ఈ జెనరేషన్ బ్యూటీ కదా.. ఈ ఎత్తు పల్లాలకు బెదిరి పోయే రకం కానే కాదు. ఎప్పటిలాగానే కసరత్తులు చేస్తూ.. హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియా లో తన సత్తా చాటుతోంది. ఫిలింమేకర్లకు తనను గుర్తించాల్సిందే అంటూ పరోక్ష సందేశం ఇస్తోంది.

ఈమధ్య రకుల్ ఒక ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలో క్రీమ్ కలర్ డ్రెస్ ధరించి అతిలోక సుందరిలాగా పోజిచ్చింది. మెడ లో వరుసలుగా ఉండే చెయిన్స్ రకుల్ అందాన్ని మరింతగా పెంచాయి. ఈ ఫోటో లో రకుల్ మేనిఛాయ.. కళ్ళ లో ఆకర్షణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పర్ఫెక్ట్ మేకప్ తో.. హెయిర్ స్టైల్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఇవన్నీ ఉన్నాయి.. ఇక హాట్ నెస్ లేకపోతే ఎలా? అందుకేనేమో సూపర్ వీనెక్ తో ఆ పని కూడా చేసి ఫోటోను ఒక వాల్ పోస్టర్ లాగా మార్చేసింది.

ఇంత చక్కగా కుదిరింది కాబట్టే సోషల్ మీడియా లో ఫోటో వైరల్ గా మారింది. రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ లో.. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మరో తమిళ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా హిందీలో కాశ్వీ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా నటిస్తోంది.
Please Read Disclaimer