రౌడీ నే రిజెక్ట్ చేసి తప్పు చేసిందే

0

కాలం కలిసి రాకపోతే.. రాబోయే అదృష్టాన్ని అంచనా వేయలేక పోతే అందుకు తగ్గ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే. అలానే తనని వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని క్యాచ్ చేయలేక వదులుకుంది రకుల్. బ్లాక్ బస్టర్ ఛాన్సుని పసిగట్టలేక అతిగా ఆలోచించి మంచి అవకాశాన్ని చేజేతులా వదులుకుందట. ఇంతకీ ఏమా అరుదైన అవకాశం? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన `అర్జున్రెడ్డి` సంచలనాల గురించి తెలిసిందే. ఆ సినిమా తరువాత విజయ్ దేవరకొండ కు హీరోగా భారీ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ సినిమా తరువాత `గీత గోవిందం`లో విజయ్ కి జోడీ గా నటించే అవకాశం ముందు అను ఇమ్యాన్యుయేల్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ ని వరించిందట.

అయితే ఆ సినిమాని సరిగ్గా అంచనా వేయలేక.. కొత్త హీరో ఎందుకులే అనుకుని వద్దనుకుందట. ఆ సినిమా రిలీజై స్టార్ హీరోల రేంజు ను మించి ఆడింది. సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఓ బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రకుల్ బయటపెట్టేసింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నలిచి వంద కోట్ల క్లబ్లో చేరిన `గీత గోవిందం` చిత్రాన్ని మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు తెగ ఫీలవుతోందట రకుల్. అదృష్ణం తలుపు తట్టినప్పుడే చటుక్కున పట్టుకోవాలి. అలా కాకుండా అతికి వెళితే ఇలాగే వుంటుందని కామెంట్లు రువ్వుతున్నారంతా.
Please Read Disclaimer