అక్క రుణం ఎలా తీర్చుకుంటావు తమ్ముడూ!

0

బ్రెయిన్ విత్ సబ్ స్టెన్స్.. కొందరే ఉంటారు ఇలా. ఆ కొందరిలో పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పేరును విస్మరించలేం. దీపం ఉండగానే చక్కదిద్దుకోవడంలో ఈ అమ్మడిని కొట్టే వాళ్లే లేరు. స్టార్ హీరోయిన్ గా టాప్ గేర్ లో ఉండగానే చకచకా తెలివైన ప్లానింగ్స్ తో తెలివైన బ్యూటీ అని ప్రూవ్ చేసింది.

నేటితరం నాయికల్లో రకుల్ ప్రీత్ తెలివైనది. బెస్ట్ ప్లానర్ అన్న టాక్ వినిపించింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తెలివిగా తనకున్న పరిచయాలతో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. సెలబ్రిటీల లైఫ్ స్టైల్ కు అవసరమయ్యే ఫిట్ నెస్ జిమ్ములను..యోగా సెంటర్లను లాంచ్ చేసింది. హైదరాబాద్- వైజాగ్- బెంగళూరు సహా పలు నగరాల్లో బ్రాంచ్ లను విస్తరించింది. ఇంకా ఇతర మెట్రో పాలిటన్ నగరాలకు వీటిని విస్తరిస్తోంది. వాటన్నింటి నిర్వహణను తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆయనవే బాధ్యతలన్నీ. ఇన్నేళ్లలో టాలీవుడ్ కి ఎందరో నాయికలు వచ్చి వెళ్లారు కానీ ఎవరూ రకుల్ తరహాలో ప్లాన్ చేసిందే లేదు. ఇలా సెలబ్రిటీ పరిచయాలను ఎవరూ వినియోగించుకున్నదే లేదు.

రకుల్ లో దాగి ఉన్న మేథావి తనంతోనే ఇదంతా చేయగల్గింది. ఎంత తెలివైంది కాకపోతే ! ఇప్పటివరకూ టాలీవుడ్ కు ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు..వెళ్లారు… వాళ్లెవరైనా ఇంత తెలివిగా వ్యవహరించారా? తన కెరీర్ తో పాటు… ఫ్యామిలీ మెంబర్ల జీవితాలను చక్క దిద్దారా? అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. తాను కథానాయికగా వెలగడమే గాక.. తనతో పాటే తమ్ముడిని తెలుగులో పెద్ద హీరోని చేసే బాధ్యతను స్వీకరించిన రకుల్ వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. తన సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ని `నిన్నే పెళ్లాడతా` అనే సినిమా తో హీరోగా లాంచ్ చేస్తూ ఇండస్ట్రీ వర్గాల్లో వేడెక్కిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. మంచి స్క్రిప్టును ఫైనల్ చేసి ..దర్శకనిర్మాతల్ని వెతికిపెట్టి తమ్ముడి ప్రాజెక్ట్ ని మూవ్ చేస్తోంది. అంతటితో రకుల్ ఆగిపోలేదు. బాలీవుడ్ లోనూ తమ్ముడు అమన్ ని లాంచ్ చేస్తోంది. `రామ్ రాజ్య` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో అక్కడ సినిమాని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది సందేశాత్మక చిత్రం. ప్రేమ..ఉగ్రవాదం..ద్వేషం..హేతువాదం వంటి ఆసక్తికర అంశాల మేళవింపుగా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రపంచం లో శాంతి..సోదరభావం అనేది ఎంత ముఖ్యం అన్నది ఈ చిత్రంలో అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నితేష్ రాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా దీపం ఉండగానే.. తమ్ముడి కెరీర్ బండిని ట్రాక్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఎంత మంది అక్కలుంటారు చెప్పండి. అందుకే అక్క రుణం ఆ తమ్ముడు ఏదో ఒకలా తీర్చుకోవాల్సి ఉంటుంది మరి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-