రకుల్ లూజ్ స్కర్టు ఖరీదు తెలిస్తే షాక్ తింటారు!

0

టాలీవుడ్ టు బాలీవుడ్ రకుల్ ప్రీత్ బిజీ షెడ్యూల్స్ గురించి తెలిసిందే. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్న ఈ బ్యూటీ ఇటీవల కెరీర్ పరంగా మరింత స్పీడ్ పెంచేసింది. అదే క్రమంలో సోషల్ మీడియాల్లో నిరంతర ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తోంది.

తాజాగా రకుల్ సమ్మర్ స్పెషల్ షూట్ వైరల్ గా మారింది. స్టన్నర్ అనిపించే ఫోటోషూట్ తో రకుల్ ఇలా బరిలో దిగింది. ఫ్యాషన్ గేమ్ లో తనను ఎవరూ టచ్ చేయలేరు అని మరోసారి ప్రూవ్ చేస్తోంది. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ స్టైల్ స్టేట్ మెంట్ తో యూత్ ని కిల్ చేస్తున్న రకుల్ ఈసారి సమ్మర్ స్టైల్ తో కట్టి పడేసింది. ఎంతో సౌకర్యవంతమైన క్లాస్పీ మినీ డ్రెస్ లో ప్రత్యక్షమైంది. ఈ లైట్ వెయిట్ వైట్ స్కర్టు ఖరీదు రూ. 2.6 లక్షలు అని తెలిసింది.

ముంబైలోని ఆర్.ఎస్.వి.పి మూవీస్ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఇలా లూజ్ చొక్కా లో ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. ఆ కాళ్లకు కాంబినేషన్ వైట్ నైక్ స్నీకర్లతో కనిపించింది. అలాగే నల్ల రంగు ముసుగును ధరించి స్టన్నర్ అనిపించింది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అర్జున్ కపూర్ తో కలిసి సర్దార్ కా గ్రాండ్ సన్ లో రకుల్ ప్రీత్ కనిపించనున్నారు. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. రిలీజ్ తేదీ ప్రకటించాల్సి ఉంది. ఇవే కాకుండా .. ఏప్రిల్ 2022 న విడుదల కానున్న అజయ్ దేవ్ గన్ – అమితాబ్ బచ్చన్ ల మూవీ మేడే లోనూ రకుల్ కనిపించనున్నారు. 2021 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అటాక్ రిలీజ్ కానుంది. ఇందులో జాన్ అబ్రహం సరసన నటించింది.