ఆరడుగుల బికినీ బుల్లెట్టు

0

ఆరడుగుల బుల్లెట్టు అంటూ పవన్ కల్యాణ్ పై ప్రశంసలు కురిపించాడో సినీకవి. ఇదిగో ఇప్పుడు ఈ బికినీని చూడగానే ఆరడుగుల బికినీ బుల్లెట్టు! అంటూ సాంగేసుకోవడం గ్యారెంటీ. ఇంతకీ ఎవరీ బికినీ బుల్లెట్టు అంటే ప్రత్యేకించి చెప్పాలా?

స్టన్నింగ్ రకుల్ ప్రీత్ సింగ్.. వ్వావ్ అనే ఫోజిచ్చింది మరి. బులుగు జిలుగు సముద్రం చెంత బులుగు బికినీలో కిర్రాక్ పుట్టించింది. మిస్ పంజాబీ కిరీటం గెలుచుకున్న ఈ సుందరి అందాల పోటీల వేళ ఈ తరహా బికినీతోనే వెర్రెత్తించింది. అదే ఇప్పుడు తన సినీకెరీర్ కి ప్లస్ అయ్యింది. అసలే ఒడ్డు పొడుగు విషయంలో ఆజానుభాహుల్లాంటి హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు ఈ అమ్మడు. పైగా బికినీ బీచ్ లో లో యాంగిల్ నుంచి కెమెరా పెట్టి ఆ ఫోజును క్యాప్చుర్ చేయడంతో ఏడడుగుల ఎత్తు కనిపిస్తోంది. రకుల్ లుక్ చూడగానే పిక్చర్ పర్ఫెక్ట్ అని పొగిడేయకుండా ఉండలేం.

స్పార్టన్ కింగ్ డమ్ నుంచి జారుకుని బీచ్ కి వచ్చి వాలిందో .. గ్రీకులు చెరబట్టిన రాకుమార్తెల జైలు నుంచో పారిపోయి ఇలా వచ్చిందా? అన్నట్టుగా ఉందా విగ్రహం. అందాల రకుల్ నాభి కేంద్రం… నడుము సొంపు అబ్బో అబ్బబ్బో అంటూ కుర్రకారు గింగిరాలు తిరిగిపోతున్నారు. బికినీ బీచ్ లో విదేశీ సుందరీమణుల బికినీ సెలబ్రేషన్ పీక్స్ లో ఉంది. ఇంతకీ ఇది ఏ బీచ్ అంటే.. స్పెయిన్ ఇబిజ బీచ్. సెలబ్రిటీ సౌరభంతో ఉర్రూతలూగే ఈ బీచ్ లో రకుల్ షో స్టాపర్ అనే చెప్పాలి. బీచ్ డైరీస్.. ఇబిజ హాలీడే అంటూ జాలీడేని ఓ రేంజులో చిలౌట్ చేసింది రకుల్. ప్రస్తుతానికి తెలుగులో ఛాన్సుల్లేవ్. హిందీలో ప్రయత్నాలు ఫలించడం లేదు. అందుకే ఇలా ఖాళీ సమయాన్ని ఆస్వాధిస్తోందన్నమాట.
Please Read Disclaimer