కూల్ రకుల్.. క్లిష్టమైన ఆసనాలు

0

రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య తెలుగులో కాస్త స్లో అయింది కానీ బాలీవుడ్ పై మాత్రం ఫుల్లుగా ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే మూడు నాలుగు హిందీ సినిమాలు చేసిన రకుల్ త్వరలో ‘మర్జావా’ తో హిందీ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా నవంబర్ 8 న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటోంది. ఇదంతా ఒక ఎత్తైతే రకుల్ తన ఫిట్నెస్ పై పెట్టే శ్రద్ధకు ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. రకుల్ మొదటి నుంచి ఫిట్నెస్ ఫ్రీక్. అందుకే జిమ్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో రకుల్ కాస్త వెయిట్ ఉండేది కానీ బాలీవుడ్ కోసం జీరో సైజ్ లోకి మారింది. కఠినమైన కసరత్తులు.. యోగా చేస్తూ.. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్ బాలీవుడ్ బ్యూటీ అనిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

రీసెంట్ గా రకుల్ తన ఇన్స్టా ఖాతా ద్వారా అనుష్క యోగా సెంటర్ లో యోగాసనాలు వేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు “ఇలాంటి ఉదయాలు ఉత్తమమైన ఉదయాలు. ఈ రకంగా మీ శరీరాన్ని సాగయండి. ఎంతమంది ఇలా చేయగలిగారో చెప్పండి… సులువు అయితే కాదు @అనుష్క యోగా”అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒకసారి ఆ ఫోటోలను తేరిపార చూడండి. మీకు ఏమాత్రం మీ కామన్ సెన్స్ ఉన్నా అలాంటి ఆసనాల జోలికి పోరు. అలా కాకుండా మీరు కూడా యోగాయిజం ఫాలో అయ్యేవారు అయితే మీకు ఈ ఆసనాలు చిటికెలో పని.

ఇక ఈ ఫోటోలలో రకుల్ ఫిట్నెస్ ఎంత పీక్స్ లో ఉందో హాట్నెస్ కూడా అంతే పీక్స్ లో ఉంది. అందుకే నెటిజన్లు కూడా ఈ ఫోటోలకు లైకులమీద లైకులు కొట్టారు. కొందరు మాత్రం ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “ఫిట్ నెస్ రోల్ మోడల్”.. “బ్యూటిఫుల్ యోగా”.. “టెర్రిఫిక్ పోజులు” అంటూ రెచ్చిపోయారు. రకుల్ సినిమాల విషయానికి వస్తే శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఒక తమిళ చిత్రంలో నటిస్తోంది. శంకర్ – కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ లో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోంది.
Please Read Disclaimer