`భారతీయుడు 2`లో రకుల్ జాక్ పాట్

0

కాజల్ లాస్.. రకుల్ కి గెయిన్ కాబోతోందా? అంటే అవుననే సమాచారం. కాజల్ వదులుకున్న `భారతీయుడు 2` ఆఫర్ ని యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ దక్కించుకుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే రకుల్ జాక్ పాట్ కొట్టేసినట్టే.

వాస్తవానికి `భారతీయుడు 2` రకరకాల కారణాలతో అంతకంతకు షూటింగ్ ఆలస్యమవుతోంది. ఒకసారి బడ్జెట్ విషయంలో నిర్మాతలు వెనకంజ వేస్తే.. మరోసారి కమల్ హాసన్ రాజకీయ షెడ్యూల్స్ బ్రేక్ వేశాయి. మరికొన్ని సాంకేతిక కారణాలు ప్రాజెక్టు డిలేకి కారణాలుగా మారాయి. ఈ ఆలస్యం భరించలేకే ఈ ప్రాజెక్టు నుంచి కాజల్ తప్పుకుంది. ఇక అన్ని చిక్కుల నుంచి బయటపడి ఎట్టకేలకు భారతీయుడు 2 షూటింగ్ ని తిరిగి ప్రారంభించేందుకు శంకర్ రెడీ అవుతున్నారు. కమల్ హాసన్ బిగ్ బాస్ హోస్టింగ్ షూట్ పూర్తవ్వగానే ఈ టీమ్ తో జాయిన్ కానున్నారట.

అలాగే `భారతీయుడు 2`లో కేవలం రకుల్ కి మాత్రమే కాదు మరో ఇద్దరు కథానాయికలకు స్కోప్ ఉందని తెలుస్తోంది. 2.0 తర్వాత లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాష్కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1996లో వచ్చిన `భారతీయుడు` చిత్రానికి ఇది సీక్వెల్. ఇకపోతే రకుల్ ప్రీత్ ప్రస్తుతం నాగార్జున సరసన మన్మధుడు 2లో నటిస్తోంది. అలాగే తమిళంలోనూ భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Please Read Disclaimer