రకుల్ బెబోకే పొగ పెడుతోందా!

0

జీరో సైజ్ అనగానే గుర్తుకొచ్చే పేరు కరీనాకపూర్. బాలీవుడ్ ని జీరో లుక్ తో ఏలిన మేటి కథానాయికగా బెబోని ఆరాధిస్తుంది యువత. ఇప్పటికీ ఆ ఇమేజ్ చెక్కు చెదరలేదు. సైఫ్ అలీఖాన్ ని పెళ్లాడి థైమూర్ కి జన్మనిచ్చినా బెబోలో ఇసుమంత కూడా వేరియేషన్ కనిపించడం లేదు.

బెబో స్థానాన్ని కొల్లగొట్టాలని చాలా మంది భామలు జీరో సైజ్ ట్రై చేసినా కుదరలేదు ఎందుకనో. సన్నజాజి నాజూకు సోకులెన్నో వేడెక్కించే వయ్యారాలతో మురిపిస్తున్నా బెబో బెబోనే అని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్. అయితే ఇటీవలి కాలంలో ఇక బెబోకి కూడా రీప్లేస్ మెంట్ వచ్చేట్టే కనిపిస్తోంది.

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అందాల రకుల్ ట్రయల్స్ చూస్తుంటే బెబోకే పొగ పెట్టేట్టుంది! రకుల్ లుక్ మునుపటితో పోలిస్తే చాలా మారిపోయింది. బొద్దుతనం తగ్గి నాజూగ్గా కనిపిస్తోంది. జీరో సైజ్ కి కూతవేటు దూరంలోనే ఉందని ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. ఇలానే ఈ ధీక్షను కొనసాగిస్తే ఇక బెబోకి రాంరాం పలికినట్టే. బ్లాక్ ఔట్ ఫిట్ లో లవ్ లీగా కనిపిస్తున్న రకుల్ బాగా బరువు తగ్గి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోని ఫ్యాన్స్ జోరుగా వైరల్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే సోషల్ మీడియాల్లో బ్రాండ్ ప్రమోషన్ తోనూ రకుల్ అదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer