గ్లామర్ మీటర్ ను పెంచిన బ్యూటీ

0

టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అనిపించుకున్న బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు అసలు ఇంట్రో ఇవ్వాల్సిన పనే లేదు. రకుల్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా వెసులుబాటు చేసుకొని మరీ ఫోటో షూట్లు చేస్తుంది. ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో మంటలు పెడుతూ ఉంటుంది. అందుకే రకుల్ కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగే ఉంది. ఇన్ స్టాగ్రామ్ ఒక్కటే తీసుకుంటే రకుల్ ఫాలోయర్స్ 9.5 మిలియన్లు ఉన్నారు.

అందుకే ఆ అనుచరుల కోసం కోసమే మరోసారి కొత్త ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతా ద్వారా పంచుకుంది. ఈ ఫోటోలకు “ఐనాక్స్ స్క్రీన్ ఎక్స్ లాంచ్ కోసం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరి ఆ స్క్రీన్ ఎక్స్ ఏ సిటీలో ఉందనే విషయం వెల్లడించలేదు. ఆ లాంచ్ సంగతేమో కానీ ఫోటోలో మాత్రం డ్రెస్సు కొత్తగా ఉంది. వైట్ కలర్ లో డిఫరెంట్ డిజైన్ ఉన్న షర్టు.. పింక్ కలర్ షార్ట్ లో ఒక ఫ్యాషన్ ఐకాన్ లా కనిపించింది. షర్టు నార్మల్ గా లేదు. వీపు కింద భాగంలో ఒక కాలనీ మొదట్లో రోడ్డుపై ఉండే కమాన్ లాగా ఒక ఓపెనింగ్ ఉంది. ఈ వెరైటీ డ్రెస్సుతో చిరునవ్వులు చిందిస్తూ పోజులిచ్చింది.

ఈ ఫోటోలకు జనాలు కూడా వెరైటీ కామెంట్లు పెట్టారు. “డామ్ క్యూట్”.. “స్టన్నింగ్ డ్రెస్ గార్జియస్ లుక్”.. “ఈ డ్రెస్ నీకు పర్ఫెక్ట్ గా సూట్ అయింది”.. “డబల్ హాట్ బేబీ డాల్” అంటూ కామెంట్లు పెట్టారు. రకుల్ సినిమాల విషయానికి వస్తే అక్కినేని నాగార్జున లేటెస్ట్ ఫిలిం ‘మన్మథుడు 2’ లో హీరోయిన్ గా నటిస్తోంది. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా హిందీలో ‘మర్జావా’ అనే చిత్రంలో కూడా రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer