టూమచ్ టు హ్యాండిల్ పాపా..

0

తెలుగు ప్రేక్షకుల్లో రకుల్ ప్రీత్ సింగ్ కు మంచి పాపులారిటీ ఉంది. ఇప్పటికే దాదాపు అందరూ టాప్ స్టార్ల సినిమాల్లో నటించిన రకుల్ పోయినేడాది ఎక్కువగా తమిళ.. హిందీ సినిమాలపై ఫోకస్ చేయడంతో తెలుగులో సినిమాలు తగ్గాయి. మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ పై దృష్టి పెడుతోంది. ఇదిల ఉంటే రకుల్ సోషల్ మీడియాలో యమా స్పీడుగా ఫోటో షూట్లు చేస్తూ.. హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటుంది.

తాజాగా మరోసారి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “నా మాజా కోసం వేచి చూస్తున్నా. మాజా విజయం వెనక ఉన్న అద్భుతమైన టీమ్ ను కలవడం చాలా సంతోషం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మాజా డ్రింక్ తో టై అప్ అయింది కాబట్టి మాజా గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పింది. అంతే కాకుండా ఆరెంజ్ కలర్ గౌన్ లో మెరిసింది.. నియాన్ పింక్ కలర్ హీల్స్ తో తన స్టైలింగ్ ను పూర్తి చేసింది. ఈ డ్రెస్ లో అందాల విందేమీ చెయ్యలేదు కానీ హాట్ ఎక్స్ ప్రెషన్లు మాత్రం ఇచ్చింది.

ఈ ఫోటోలకు ది వన్ అండ్ ఓన్లీ మంచు లక్ష్మి “టూమచ్ టు హ్యాండిల్ పాపా” అంటూ కామెంట్ పెట్టింది. ఇక సాధారణ నెటిజన్లు కూడా తక్కువేమీ తినలేదు. “మాజా డ్రెస్..మజా ఆయా”.. “గజబ్ హై మేరె జాన్”.. “బ్యూటిఫుల్ క్వీన్” అంటూ పొగడ్తలతో చంపేశారు. రకుల్ సినిమాల విషయానికి వస్తే అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘మన్మథుడు 2’ లో హీరోయిన్ గా నటిస్తోంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఒక తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా హిందీలో ‘మర్జావా’ అనే చిత్రంలో కూడా రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer