రకుల్ ని ఇలా చూశారా ఎపుడైనా?

0

`మన్మధుడు 2`లో అంతగా చెలరేగిందేం? అంటూ ఫ్యాన్స్ గుసగుసలాడారు. కానీ అంతకుమించి అజయ్ దేవగన్ సరసన `దే దే ప్యార్ దే` చిత్రంలో అందాలు ఆరబోసింది. బాలీవుడ్ లో అంతగా భేషజానికి పోతే కుదరదు. అందుకే అక్కడ క్లీవేజ్ షోలతో విరుచుకుపడుతోంది. తాజాగా మరోసారి అలాంటి దూకుడే చూపించింది అమ్మడు. ఇంతకీ ఎవరీ భామ? అంటారా.. ఇంకెవరూ పంజాబి కుడి రకుల్ ప్రీత్.

ప్రస్తుతం ఈ స్పైసీ గాళ్ నటించిన `మర్జావాన్` రిలీజ్ కి వస్తోంది. నవంబర్ లో ఉత్తరాది ఆడియెన్ ని షేక్ చేయబోతోంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ రఫ్ అండ్ ఠఫ్ మాస్ పాత్రలో నటిస్తున్నాడు. దొరికిన వాళ్లను దొరకని వాళ్లను ఇరగ కుమ్మేస్తున్నాడు. ఫక్తు తెలుగు సినిమా ఫైట్స్ తో అతడు చెలరేగిపోతున్నాడు. ఇదివరకూ రిలీజైన ట్రైలర్ చూడగానే ఇదో పక్కా ఊరమాస్ సినిమా అని అర్థమైంది.

ఇందులో రకుల్ ప్రీత్ స్పెషల్ ఐటెమ్ నంబర్ తోనూ చెలరేగింది. ఆ వీడియో గీతాన్ని తాజాగా రిలీజ్ చేశారు. హైయా హో.. అంటూ స్పైసీగా ఈ ఐటెమ్ ని తీర్చిదిద్దారు. తనిష్క్ బాగ్చి ఈ పాటకు సంగీతం అందించారు. తులసీ కుమార్ పాడారు. సాంగ్ ఆద్యంతం రకుల్ అందాల ఎలివేషన్ అదిరింది. ఎద అందాల్ని ఎలివేట్ చేసే బ్లౌజ్.. ఒంటిపై నిలవనంటున్న డిజైనర్ శారీలో అమ్మడి అందచందాల ట్రీట్ ఓ రేంజులోనే ఉంది. ఒంపు సొంపుల వయ్యారాల వడ్డనలు చేసింది. అయితే తులసీ ఆలాపనకు తగ్గట్టు ఆ స్వరంలోని గమ్మత్తయిన మత్తుకు తగ్గట్టు కళ్లలో హావభావాల్ని చూపించడంలో మాత్రం తడబడిందనే చెప్పాలి. రకుల్ కి ఈ తరహా ఐటెమ్ నంబర్ తొలిసారి. అందుకే అనుభవ లేమి స్పష్టంగా ఫేసియల్ ఎక్స్ ప్రెషన్స్ లో తెలిసిపోతోంది. అయితే ఈ బ్యూటీ మరింతగా ప్రాక్టీస్ చేసి ఉంటే ఆ లోపం సరి చేసుకునేదే. ఇకపోతే మాస్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మాత్రం పాట ఆద్యంతం చితక్కొట్టడంలోనే బిజీ. అతడు ఓ రౌడీని తలపిస్తూ ముఖంపై గాటుతో కనిపించాడు.
Please Read Disclaimer