వైరల్ అవుతున్నరకుల్ మసాజ్ వీడియో!!

0

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ వాళ్ల ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా.. ఇంటి నుండి కాలు బయట పెట్టకుండా సమయాన్ని గడుపుతున్నారు. ఫ్యామిలీతో ఉన్నప్పుడు చేసే ప్రతి పని చాలా సరదాగా ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో ఎవరికి వారు తమ చిన్న నాటి సంఘటనలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముంబైలో తన తమ్ముడు అమన్ తో మొన్నటి వరకు కలిసి ఉంది. రకుల్ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉన్నారు. ఇక తమ్ముడు ఉండడంతో ప్రతిరోజు టైమ్ పాస్ చేసింది రకుల్. చిన్నతనంలో జరిగిన జ్ఞాపకాలను అన్నీ పంచుకునే ప్రయత్నం చేసింది. ఈ లాంగ్ లాక్ డౌన్ తనను చిన్నప్పటి రోజులకు తీసుకువెళ్లిందని తెలిపింది. చిన్నతనంలో తమ్ముడితో కలిసి ఆడిన ఆటలను మళ్లీ ఆడింది.

అయితే రకుల్ తమ్ముడితో పాటు తల్లిదండ్రులతో కూడా ఎంతో సన్నిహితంగా ఉంటుందో ఆ మధ్య తల్లి వివరించిన సంగతి తెలిసిందే. నిజానికి నన్ను ఫ్యాషన్.. సినీ రంగం వైపు ప్రోత్సహించింది నా తల్లిదండ్రులే అని చెప్పింది. అంతేగాక నా కాస్ట్యూమ్స్ విషయంలో.. బికినీ విషయంలోనూ వారే సలహాలు ఇస్తుంటారని ఓ బడా బాంబ్ పేల్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ బ్యూటీ ఇటీవలే తాజాగా షేర్ చేసిన ఓ వీడియో తండ్రి కూతురు మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుంది. తాజాగా వీకెండ్ను రకుల్ ప్రీత్ ఎంతో సరదాగా తన తండ్రితో గడుపుతున్నట్టు తెలుస్తోంది. రకుల్ తండ్రి తన గారాలపట్టికి హెడ్ మసాజ్ చేస్తున్నాడు. ఓ వైపు మ్యూజిక్ మరో వైపు హెడ్ మసాజ్.. ఆ వీడియోలో రకుల్ బాగా ఎంజాయ్ చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలా సెలబ్రిటీలంతా తమ ఫ్యామిలీలతో కలిసి జాలీగా కాలాన్ని ఎంజాయ్ చేస్తున్నారు
Please Read Disclaimer