స్టైల్ ఐకన్ కిర్రాక్ పుట్టిస్తోంది

0

హైదరాబాద్ పరిశ్రమతో పోలిస్తే ముంబై పరిశ్రమలో పోటీతత్వం గురించి తెలిసిందే. ఇటీవల డెబ్యూ కథానాయికల వెల్లువ.. నెప్టోయిజం ఎఫెక్ట్ మరింత ఎక్కువైంది. దీంతో కాంపిటీషన్ చాలా ఠఫ్ గా కనిపిస్తోంది. పైగా బరిలో దిగుతున్న అందగత్తెలంతా స్టైల్ & ఫ్యాషన్స్ పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. నిరంతరం యూత్ అటెన్షన్ తమవైపు నుంచి మరలిపోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పబ్లిక్ అప్పియరెన్స్ పరంగా ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా కుర్ర భామలు చెలరేగుతున్నారు.

అలాంటి చోట కెరీర్ కోసం గత మూడేళ్లుగా రకుల్ ఎలాంటి పోరాటం సాగిస్తోందో తెలిసిందే. ఆరంభం ‘మన్మార్జియాన్’ అనే చిత్రంలో నటించింది. కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత అజయ్ దేవగన్ సరసన ‘దేదే ప్యార్ దే’ అనే హిట్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత రకుల్ పూర్తిగా ముంబై పరిశ్రమపై మనసు పారేసుకుని అక్కడ సెటిలయ్యేందుకు ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘మర్జావాన్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. మాస్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఈ చిత్రంలో నటించింది. ఇందులో తారా సుతారియా మరో కథానాయిక. సిద్ధార్థ్ తో ముక్కోణపు ప్రేమకథలో విరహవేదన అనుభవించే ప్రేమికురాలిగా రకుల్ కనిపించబోతోంది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కి వస్తోంది.

ఈ సందర్భంగా మర్జవాన్ ప్రమోషన్స్ లో భాగంగా రకుల్ మీడియా ఇంటరాక్షన్స్ తో బిజీబిజీగా ఉంటోంది. మరోవైపు ఆన్ లొకేషన్ సైతం రకుల్ మర్జవాన్ ప్రచారంతో హీటెక్కిస్తోంది. తాజాగా రకుల్ స్టైల్ ఐకన్ ని తలపిస్తూ ఆన్ సెట్స్ కారవ్యాన్ ముందు ఇచ్చిన ఈ ఫోజులు ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టీషర్ట్ .. 3/4 ట్రాక్ ఫ్యాంట్ తో ఇదిగో ఇలా స్మైలిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

రకుల్ తాజా చిత్రం ‘మర్జవాన్’ రొమాంటిక్ యాక్షన్ మూవీ. మిలాప్ జావేరి దర్శకత్వం వహించారు. ఇందులో రితీష్ దేశ్ ముఖ్ ఓ ప్రధాన పాత్రల్లో నటించాడు. ఈ సినిమాతో పాటు ఎస్.కే 14 లో శివకార్తికేయన్ సరసన రాకుల్ నటిస్తోంది. శంకర్ తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఇండియన్ 2’ లోను నటిస్తోంది. ఇందులో కమల్ హాసన్- కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer