రకుల్ ప్రేమకథ గుట్టు తెలిసే!

0

పంజాబి బ్యూటీ రకుల్ ప్రీత్ ప్రేమలో పడిందా? అంటే అవుననే అర్థమవుతోంది. ఆ మాట నిజమే.. రకుల్ ప్రేమలో పడింది. ఆ ప్రేమకథ గుట్టు మొత్తం లీకైంది. సారీ.. తనకు తానుగానే లీక్ చేసింది. దీనిని హింటు అనుకోవాలా.. లేక తొందర్లోనే తన ప్రేమాయణం గురించి మొత్తం తనే చెప్పేస్తుందా? కాస్త ఓపిగ్గా వేచి చూడాలి. ఇంతకీ రకుల్ ఎవరితో ప్రేమలో పడింది.. ఎవరా కుర్రాడు? గప్ చుప్.. సైలెన్స్ ప్లీజ్!!

ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ కి అయినా వృత్తిగత జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఉంటుంది అని ఉలగనాయగన్ కమల్ హాసన్ వారసురాలు శ్రుతిహాసన్ చెప్పకనే చెప్పింది. తనకు వ్యక్తిగత జీవితం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పింది. అంతేకాదు.. తన బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో కలిసి సహజీవనం సాగించడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రకుల్ కూడా అలానే ఆలోచిస్తోందా? తాను ప్రేమలో పడిందా.. అంటే అవుననే ఊహిస్తున్నారు యువజనం. అందుకు తగ్గ హింట్ ను కూడా పసిగట్టారు కొంటె కుర్రాళ్లు.

లేటెస్టుగా రకుల్ ఓ ఫోటోని తన ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసి – దానికి ఓ కొటేషన్ కూడా ఇచ్చింది. ఈ కొటేషన్ అర్థం.. తాను ప్రేమలో ఉన్నాననే. గోవా డైరీస్ .. కొబ్బరిచెట్టు ఈమోజీ.. ఆ పక్కనే లవ్ లైఫ్.. ఫ్రెండ్స్!! అంటూ గుంభనంగా తెలిసీ తెలియనట్టు – మెదిలీ మెదలనట్టు తన టీనేజీ జ్ఞాపకాల్ని కాస్తా బయటపెట్టింది. టీనేజీ – స్కూలేజీ – కాలేజీ లైఫ్ లో తన స్నేహితులతో కలిసి గోవాలో రకుల్ విహరించి ఉండాలి. అప్పుడే తను మనసుపడిన కుర్రాడితో గోవా బీచ్ లోనూ సరదా షికార్లు చేసి ఉండొచ్చు! అంటూ కొంటె కుర్రాళ్లు ఏవేవో ఊహిస్తున్నారు. అందుకు సింబాలిక్ గానే స్నేహితులు.. లవ్ లైఫ్ అనే అర్థమయ్యీ అవ్వనట్టుండే పదాల్ని ఉపయోగించిందన్నమాట. ప్చ్! రకుల్ లవ్ స్టోరి గుట్టు మొత్తం లీకైనట్టే కదా? రకుల్ ప్రస్తుతం `ఎన్టీఆర్` బయోపిక్ లో నటిస్తోంది. తమిళంలో సూర్య-కార్తీ బ్రదర్స్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.
Please Read Disclaimer