ఎరుపు రంగు.. గ్లామర్ డేంజర్

0

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఈమధ్య కాస్త నెమ్మదించిన సంగతి తెలిసింది. వరస ఫ్లాపులు తగలడం.. కొత్త హీరోయిన్ల రాకతో రకుల్ కు టాలీవుడ్ ఆఫర్లు తగ్గాయి. అయితే రకుల్ ఈ ఆఫర్లతో సంబంధం లేకుండా తమిళ.. హిందీ సినిమాలపై ఎక్కువగా దృష్టి సారించింది. ఇక సోషల్ మీడియాలో హీటు పెంచడం అనే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది.

ఎప్పటిలాగే ఈమధ్య రకుల్ ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ ఫోటో కోసం రెడ్ థీమ్ ఎంచుకోవడం విశేషం. ఎరుపు రంగు టాప్.. షార్ట్.. జాకెట్ ధరించి అదే రంగు నేపథ్యంలో సూపర్ స్టైలిష్ గా నిలుచుంది. ఆభరణాలు గట్రా లేకుండా తక్కువ మేకప్ తో మోడరన్ బ్యూటీలా.. అంతర్జాతీయ మోడల్ తరహాలో కనిపిస్తోంది. జీరో సైజ్ బ్యూటీలా కనిపించాలంటే ఏ భామకైనా గంటలతరబడి కసరత్తులు చేయడం తప్పదు. రకుల్ కూడా ఫిట్ నెస్ అంటే చెవులు కోసుకునే సెలబ్రిటీ కావడంతో ఈ ఎంతో ఫిట్ గా కనిపిస్తోంది.

ఈ రేంజ్ లో రకుల్ గ్లామర్ ను రంగరిస్తూ ఉంటే సోషల్ మీడియాలో నెటిజన్లు రకుల్ ను ఫాలో కాకుండా ఎలా ఉంటారు. అందుకే రకుల్ కు ఇన్స్టా లో 12 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. ఇక రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ లో.. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మరో తమిళ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా హిందీలో ఇంకో సినిమాలో నటిస్తోంది.
Please Read Disclaimer