గ్లోబల్ స్పా మ్యాగజైన్ కోసం రచ్చ!

0

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ మొదట్లో టాలీవుడ్ లో మంచి ఊపు మీద కనిపించింది కానీ ఈమధ్య ఆ జోష్ లేదు. ప్రస్తుతం రకుల్ ఎక్కువగా హిందీ సినిమాలపైనే దృష్టి సారిస్తోంది. అడపాదడపా తమిళ చిత్రాలు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాను.. అందులో ఉండే అమాయక నెటిజన్లను తనదైన శైలిలో కబాబ్స్ ను గ్రిల్ చేసినట్టుగా ఆయిల్ లేకుండా వేడితో కాల్చుకుతింటోంది.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఒక సెన్సేషనల్ ఫోటో షూట్ లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది. గ్లోబల్ స్పా అనే మ్యాగజైన్ కోసం ఈ ఫోటో షూట్ చేసింది రకుల్. ఒక ఫోటోలో నిమ్మపండు రంగు గౌన్ ధరించి పైన ఊరికే అలా ఒక టాప్ వేసుకొని కూర్చుంది. డ్రెస్ కు తగ్గ మేకప్… ఇయర్ రింగ్స్ తో సూపర్ స్టైల్ ఒలకబోసింది. మరో ఫోటోలో ప్రింటెడ్ షర్టు ధరించి బటన్లు పెట్టుకోకుండా హాట్ నెస్ ను రంగరించింది. ఇంత హాటుగా కనిపించడానికి రకుల్ రోజూ గంటల తరబడి ఎక్సర్ సైజులు చేస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే సూపర్ స్లిమ్ గా ఫిట్ గా కనిపిస్తుంది.

ఈ ఫోటోలకు “నేను ఫ్లర్టింగ్ చెయ్యగలను.. కెమెరాతో” అంటూ ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. చాలామందికి ఈ కిటుకు తెలియక ఎక్కడపడితే అక్కడ ఫ్లర్టింగ్ చేస్తుంటారు. కెమెరాతో ఫ్లర్టింగ్ చేస్తే దాని ద్వారా లక్షలాది నెటిజన్లతో ఫ్లర్టింగ్ చేసినట్టే కదా. రకుల్ కు భారీ ఫాలోయింది ఉంది కాబట్టి వారు ఫ్లర్టింగ్ బారిన పడుతుంటారు. ఈ ఫోటోలకు మంచి కామెంట్లే వచ్చాయి. “హీటు ఎక్కువైంది”.. “ఫ్లర్టింగ్ చేయడమే పనిగా పట్టుకున్నావా”.. “షర్టుకు బటన్లు లేవా?”అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ లో.. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా హిందీలో మరో సినిమాలో నటిస్తోంది.