ప్యారిస్ మోడల్ లా మారిందే

0

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఈమధ్య కాస్త తగ్గింది. ముఖ్యంగా చివరి సినిమా ‘మన్మథుడు 2’ తో ఉన్న కొంచెం క్రేజ్ కూడా తగ్గిపోయింది. దీంతో సంబంధం లేకుండా రకుల్ ప్రస్తుతం హిందీ.. తమిళ సినిమాలపై దృష్టి సారించింది. ఇదిలా ఉంటే మ్యాగజైన్లలో మంటలు పెట్టే బృహత్తర కార్యక్రమాన్ని రసవత్తరంగా కొనసాగిస్తోంది. నెటిజన్లను ఆకర్షిస్తోంది.

తాజాగా ఈ భామ ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ కవర్ పేజిపై మెరిసింది. ఆ కవర్ పేజి ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ “డిసెంబర్ వచ్చిందంటే ఇది వేడుకలు చేసుకోవాల్సిన సమయం. ఎఫ్ హెచ్ ఎం కవర్ పై నన్ను చూడండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో కనిపించింది.. ఫుల్ స్లీవ్స్ ఉండే బ్లాక్ ఫ్రాక్.. పారదర్శకంగా ఉండే లెహెంగా లాంటి డిజైన్ తో యమా స్టైలిష్ గా కనిపించింది. పాయింటెడ్ హీల్స్ ఉండే నలుపు రంగు బూట్లు ధరించి.. చేతిలో ఒక బ్యాగ్ పట్టుకుని ఒక అంతర్జాతీయ మోడల్ తరహాలో నిలుచుంది. హెయిర్ స్టైలింగ్ కూడా అదిరిపోయింది.

ఈ రేంజ్ లో ఫోటో షూట్ చేస్తే నెటిజన్లు ఇంప్రెస్ కాకుండా ఎలా ఉంటారు? అందుకే వారికి తోచిన కామెంట్లు పెట్టి రకుల్ కు జేజేలు తెలిపారు. “బ్లాక్ కలర్ బాంబ్”.. “ప్యారిస్ మోడల్ లా ఉన్నావు”.. “కూల్ రకుల్ ఆన్ ఫైర్” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ లో.. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మరో తమిళ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా హిందీలో ఇంకో సినిమాలో నటిస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home