నేను అది అర్థం చేసుకున్న : రకుల్

0

టాలీవుడ్ లో లక్ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు ఒకానొక సమయంలో మహేష్ బాబు సినిమాకే డేట్లు లేవంటూ చెప్పేసింది. ఆ తర్వాత మరో సినిమాకు మహేష్ బాబు మళ్లీ పిలిచి మరీ ఈమెకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ రేంజ్ లో ఈ అమ్మడు ఓ రెండు మూడు సంవత్సరాల పాటు టాలీవుడ్ ను ఏలేసింది. అయితే చేసినవన్నీ కూడా కమర్షియల్ పాత్రలే అవ్వడంతో ఈమె కెరీర్ చాలా తక్కువ సమయంలోనే డౌన్ ఫాల్ కు గురైంది.

ప్రస్తుతం ఈమెను టాలీవుడ్.. కోలీవుడ్ లో పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో తన చేతుల్లోకి వచ్చిన ఆఫర్లు చేజారి పోయాయని.. తాను చేయాల్సిన సినిమాలు ఇతర హీరోయిన్స్ చేశారంది. అయితే తన వరకు వచ్చి వెళ్లిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటూ చెప్పుకొచ్చింది.

ఇక సౌత్ లో హీరోయిన్స్ పారితోషికం విషయంలో మీ స్పందన ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో ఇక్కడ హీరోలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు రాగలరు. అందుకే వారికి భారీ పారితోషికాలు ఉంటాయి. ఆ స్థాయిలో హీరోయిన్స్ కు ఉండాలని నేను అనుకోను. ఈ లాజిక్ ను అర్థం చేసుకున్నాను. అందుకే నేనెప్పుడు పారితోషికం విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదంటూ చెప్పుకొచ్చింది.