ఇల్లు అమ్మకం అంతా ఉత్తుత్తేనట!

0

గత కొంతకాలంగా రకుల్ ప్రీత్ దుకాణం సర్ధేస్తోందన్న ప్రచారం వేడెక్కించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఇల్లు అమ్ముకుని బెంగళూరుకి షిఫ్టవుతోందన్న ప్రచారం అభిమానుల్ని నిశ్చేష్టుల్ని చేసింది. ఇంతలోనే అంత సీరియస్ డెసిషన్ ఎందుకు తీసుకుంది? అంటూ ఆరాలు మొదలయ్యాయి. అయితే బెంగళూరులో రకుల్ ఎఫ్ 45 జిమ్ బిజినెస్ విస్తరిస్తూ ఇరుగు పొరుగు భాషల్లో నటించే ఆలోచన చేసిందని ప్రచారమైంది. అందుకోసం హైదరాబాద్ లో తనకు గిఫ్ట్ గా వచ్చిన ఖరీదైన ఇంటిని అమ్మకానికి పెట్టిందని ఊకదంపుడుగా ప్రచారమైంది.

అయితే ఇదంతా నిజమా? అంటే ఇలా ప్రచారం చేసిందెవరు? అంతా రాంగ్ పబ్లిసిటీ అంటూ రకుల్ ప్రీత్ సీరియస్ అయ్యిందట. అసలిదంతా ఎవరు చేస్తున్నారు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. తాను ఇల్లు అమ్మడం లేదు.. బెంగళూరుకు సామాన్లు సర్ధేయడం లేదు. ఇప్పటికీ ఇంకా హైదరాబాద్ లో తన జిమ్ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేయాలనే ప్రణాళికల్లోనే ఉందట. తనపై అలా ప్రచారం చేసిన వారిపైనా సీరియస్ గానే ఉందని తెలుస్తోంది.

అంతేకాదు ఇలాంటివి రాసేప్పుడు నిజాలేంటో తెలుసుకుని రాయాల్సిందిగా గాసిప్ రాయుళ్లపైనా ఫైర్ అయ్యింది. మన్మధుడు 2 ఫ్లాపైంది మొదలు రకుల్ పై నెగెటివ్ పబ్లిసిటీ మొదలైంది. అది కాస్తా ఇలా పీక్స్ కి చేరుకుంది. ప్రస్తుతం రకుల్ ఏక కాలంలో సౌత్ – నార్త్ సినిమాల్లో నటించే ప్లాన్ లో ఉంది. మరోవైపు బిజినెస్ వెంచర్లతో క్షణం తీరిక లేనంత బిజీ కాబోతోందట.
Please Read Disclaimer