అయ్యో పాపం.. రకుల్ టైం అస్సలు బాగాలేదు

0

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. కాని ఇప్పుడు మాత్రం ఈ అమ్మడి పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఈమె కెరీర్ తుది అంకంకు చేరినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ 2 మరియు ఒకటి రెండు చిన్నా చితకా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఈ అమ్మడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది.

బాలీవుడ్ లో ఈ అమ్మడు అయిదు సంవత్సరాల క్రితం నటించిన షిమ్లా మిర్చి అనే చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్దం అయ్యింది. ప్రముఖ దర్శకుడు రమేష్ షిప్పీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతో బాలీవుడ్ లో బిజీ అవ్వొచ్చు అని ఈ అమ్మడు ఆశ పడింది. అయిదు సంవత్సరాలు కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోని షిమ్లా మిర్చి చిత్రం ఇప్పటికి విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లవచ్చు అని భావిస్తున్న సమయంలో ఆ చిత్రాన్ని థియేటర్ లలో కాకుండా నేరుగా నెట్ ప్లిక్స్ లో విడుదల చేయబోతున్నారు.

షిమ్లా మిర్చి చిత్రంలో రకుల్ అందాల ప్రదర్శణ చేయడంతో పాటు ఆకట్టుకునే నటనను కూడా కనబర్చింది. ఈ అమ్మడు చేసిన ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయితే ఖచ్చితంగా అక్కడ ఒకటి రెండు ఆఫర్లు అయినా వచ్చేవి. కాని ఇప్పుడు నెట్ ప్లిక్స్ లో విడుదల కాబోతున్న కారణంగా అసలు ఈచిత్రాన్ని జనాలు పట్టించుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే ఆఫర్లు లేని సమయంలో ఇలాంటి ఒక పరిణామం రకుల్ కు నిజంగా బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు.
Please Read Disclaimer