టైమ్స్ షోలో టెర్రిఫిక్ బ్యూటీ

0

రకుల్ ప్రీత్ తెలుగులో కొంతకాలం స్టార్ హీరోయిన్ గానే కొనసాగింది కానీ ఈమధ్య వరస ఫెయిల్యూర్లతో కాస్త వెనకబడింది. అయితే ఫ్యాషన్ విషయానికి వస్తే చలామంది హీరోయిన్లు రకుల్ దరిదాపుల్లో కూడా నిలువలేరు. ట్రెడిషనల్ డ్రెస్ అయినా.. మోడరన్ డ్రెస్ అయినా చించి అవతలేస్తుంది. అంటే డ్రెస్సును చించి పీలికలుగా చేసి పారేస్తుందనే మెరుగైన అర్థం కాదు. కళాపోషకుల మనసులని తన హాటు లుక్కులతో చించిపారేస్తుందని.

ఈ భామ రీసెంట్ గా బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ ఈవెంటుకు హాజరైంది. అక్కడ డిజైనర్ డ్రెస్సు ధరించి హొయలొలికిస్తూ ర్యాంపుపై క్యాట్ వాక్ చేసింది. బేబీ పింక్ కలర్ డ్రెస్… గౌన్ కిందభాగం పారదర్శకంగా ఉంది.. మెట్ల తరహాలో ఫ్రిల్స్ కూడా ఉన్నాయి. డ్రెస్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కిరాక్ అనుకోండి. మెడలో ఒక వెడల్పాటి నెక్లెస్ ధరించి.నెక్లెస్ బ్యూటిఫుల్ గా ఉంది. ఇక రకుల్ నడిచే స్టైల్.. ఫేస్ పై ఆ చిరునవ్వు చూస్తే ఓ పర్ఫెక్ట్ ఇండియన్ మోడల్ లాగా ఉంది. ఫ్యాషన్ విషయంలో రకుల్ ను అసలు వంక పెట్టలేం. ఆ విషయాన్ని ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో మరోసారి ప్రూవ్ చేసింది.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ స్పందన దక్కింది. ఎక్కువమంది ఫైర్ ఎమోజిలతో లవ్ ఎమోజీలతో తమ జేజేలు తెలిపారు. కొందరు మాత్రం ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “మిస్ ఇండియాలా ఉన్నావు”.. “బ్యూటిఫుల్ బార్బీ డాల్”.. “గ్లామర్ డోస్ పెరిగింది”.. “టెర్రిఫిక్ బ్యూటీ” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. రకుల్ సినిమాల విషయానికి వస్తే శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఒక తమిళ చిత్రంలో నటిస్తోంది. శంకర్ – కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ లో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోంది. రకుల్ నటించిన హిందీ చిత్రం ‘మర్జావా’ నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments are closed.