పెళ్లయిన హీరోలతో ఆ బెడద లేదంది!

0

వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీ అవుతోంది రకుల్. సౌత్ కంటే అటు వైపే ఎక్కువ మొగ్గు చూపుతోంది ఈ పంజాబీ బ్యూటీ. ఈ అమ్మడు నటించిన రెండు హిందీ సినిమాలు ఈ ఏడాది ఇప్పటికే రిలీజయ్యాయి. దే దే ప్యార్ దే- మర్జవాన్ చిత్రాలు రిలీజవ్వగా దేదే చిత్రం చక్కని విజయం అందుకుంది. మర్జవాన్ ఫర్వాలేదన్న టాక్ తెచ్చుకుంది. ఆ క్రమంలోనే రకుల్ బాలీవుడ్ లో మరిన్ని స్క్రిప్టులు వింటోందట. అంతేకాదు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన కొన్ని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

ఓ కోస్టార్ తనని కొట్టాడని.. సస్పెన్స్ క్రియేట్ చేసిన రకుల్.. మరో ఆసక్తికర ప్రశ్నకు సమాధానమిస్తూ.. రహస్య ప్రేమికుడి గురించి రివీల్ చేయకుండా దాచేసింది. యారియాన్ సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో నిండా ప్రేమలో మునిగిందని వార్తలొచ్చాయి. కానీ అతడిని ఇప్పటికీ కేవలం స్నేహితుడిగా మాత్రమే చూస్తోందట ఈ అమ్మడు. సిద్ధార్థ్ కి ఇప్పటికే ఎందరో కథానాయికలతో లింకప్ వార్తలు వచ్చాయి. అందులో నాది కూడా ఒకటి అనేసింది. మర్జావాన్ చిత్రంలో సిద్ధార్థ్ ని సోలోగా ప్రేమించే యువతిగా విరహవేదన అనుభవిస్తూ కనిపించింది.

మరి కో స్టార్లలో ఎవరినీ ప్రేమించలేదా? అని ప్రశ్నిస్తే టాలీవుడ్ లో అందరూ పెళ్లయిన హీరోలతోనే నటించానని అందువల్ల ప్రేమించేందుకు ఆస్కారం లేదని సెలవిచ్చింది. రామ్ చరణ్- అల్లు అర్జున్- మహేష్ వీళ్లందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. అలాంటప్పుడు కుదరదు కదా! అంటూ ఛమత్కరిస్తూ నవ్వేసింది. అజయ్ దేవగన్ కూడా పెళ్లయినవాడే కాబట్టి తనని ప్రేమించేందుకు కూడా అస్సలు కుదరలేదట.
Please Read Disclaimer