‘మాస్క్ – శానిటైజర్ తప్పనిసరి’ అంటున్న రకుల్

0

కరోనా వ్యాప్తి అనేది దేశంలోని సినీ ఇండస్ట్రీలపై భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటికే విడుదలకు సిద్దమైన సినిమాలు ఆగిపోవడం – షూటింగులు జరుపుకుంటున్న సినిమాలు నిలిపివేయడం జరుగుతూ ఉంది. సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో కొందరు సినీ సెలెబ్రిటీలు కరోనా వ్యాప్తి నివారణ గురించి జనానికి అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా వేదికగా ప్రయత్నిస్తున్నారు. సౌత్ ఇండియన్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన వంతు ప్రయత్నంగా ఇంస్టాగ్రాంలో పోస్టులతో సందేశాన్ని అందిస్తుంది.

ప్రస్తుతం ఈ గ్లామర్ క్వీన్ కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్-2’ సినిమాలో నటిస్తుంది. గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. రకుల్ ఇంస్టా ద్వారా స్పందిస్తూ.. దయచేసి అందరూ కరోనా బారి నుండి జాగ్రత్తగా ఉండాలని – ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపింది. అవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటికి వెళ్లకూడదని – ప్రభుత్వం – వైద్య శాఖలు అందిస్తున్న సూచనలు సలహాలను ఖచ్చితంగా పాటించాలని చెప్పింది.

ఇంస్టాగ్రాంలో తను మాస్క్ ధరించి చేతిలో శానిటైజర్ పట్టుకొని ఉన్న ఫోటోను రకుల్ పోస్టు చేసింది. కరోనా వైరస్ తో తెలివిగా ఆలోచించి చిరునవ్వుతో పోరాడాలని తన విలువైన సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. రకుల్ చివరిసారిగా తెలుగులో మన్మధుడు-2 సినిమాలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాను తను అంగీకరించలేదు. తమిళ్ – హిందీ సినిమాలతో రకుల్ ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సంవత్సరం తెలుగులో రకుల్ కనిపించదు కాబోలు..
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-