వొంటిని విల్లులా వొంచేస్తోంది

0

కథానాయికల్లో ఫిట్నెస్ ఫ్రీక్స్ జాబితాని తిరగేస్తే రకుల్ పేరు టాప్ లో ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో ఎంతో బొద్దుగా కనిపించిన రకుల్ కాలక్రమంలో తీగ లాగా మారేందుకు చాలానే శ్రమించింది. చరణ్ సరసన ధృవ స్మార్ట్ అప్పియరెన్స్ తో కనిపించేందుకు చాలానే హార్డ్ వర్క్ చేసిందట. అయితే అంతకుమించి ఇటీవల `దేదే ప్యార్ దే` చిత్రంలో రకుల్ మేకోవర్ అభిమానులకు షాకిచ్చింది. అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరో సరసన అవకాశం అందుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ కి జీరో సైజ్ లో ట్రీట్ ఇచ్చింది. ఈ చిత్రంలో సన్నజాజి తీగలా మెరుపులు మెరిపించింది. రకుల్ లుక్ అనూహ్యంగా మారడంపై అభిమానులు ఆసక్తిగా ముచ్చటించుకున్నారు. దేదే .. చిత్రంలో పాతిక వయసు అయేషాగా నటించిన రకుల్ ని `నా కూతురు` అంటూ వైఫ్ టబుకి పరిచయం చేస్తాడు అజయ్ దేవగన్.

ఆ పాత్రకు తగ్గట్టే రూపాన్ని మార్చుకుంది అమ్మడు. అయితే పాత్ర అవసరం మేరకు మేకోవర్ చూపించాలంటే అందుకు ఎంతో శ్రమించాలి. అందుకే రకుల్ ఆల్వేస్ జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ ఆ రూపాన్ని పర్ఫెక్ట్ గా మెయింటెయిన్ చేస్తోంది. తాజాగా రిలీజైన `మన్మధుడు 2` టీజర్ లోనూ రకుల్ హాట్ అప్పియరెన్స్ గురించి యూత్ ఒకటే ఇదిగా మాట్లాడుకుంటున్నారు. లేటు వయసు మన్మధుడి ప్రేమలో పడే మోడ్రన్ అమ్మాయిగా రకుల్ లుక్ కుర్రకారుకు కంటిమీద కునుకుపట్టనీలేదంటే అతిశయోక్తి కాదు.

అయితే ఈ రూపం కోసం రకుల్ ఎంత కష్టపడుతుందో తాజాగా సోషల్ మీడియాలో రివీల్ చేసిన ఈ ఫోటో చెబుతోంది. శరీరాన్ని ఇలా విల్లులాగా వంచేస్తూ ఎంతగా శ్రమిస్తుందో చూస్తుంటే ఔరా! అనిపిస్తోంది. ఆ పొడవాటి కాళ్లకు ఆ స్పెషల్ ఎక్సర్ సైజులు అంత వీజీ ఏం కాదు. రోప్ ఆధారంగా చేసే ఈ ఎక్సర్ సైజులు తొడభాగంలో ఫ్యాట్ ని కరిగిస్తాయి. అందుకోసం రకుల్ ఎంతగా శ్రమిస్తోందో! ప్రస్తుతం ఈ ఫోటో యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. `మన్మధుడు 2` చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు జిమ్ముల్లో ఈ అమ్మడు ఎంత హార్డ్ వర్క్ చేసిందో ఫోటోలు వీడియోలు రివీలైన సంగతి తెలిసిందే. ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన రకుల్ ఇప్పటికే ఫిట్ నెస్ జిమ్ముల వ్యాపారంలోనూ ఎంటర్ ప్రెన్యూర్ గా దూసుకుపోతోంది.
Please Read Disclaimer