దీపావళి మెసేజ్.. బుక్కైన రకుల్!

0

మేథావులుగా చెలామణి అయ్యేవారికి.. కొందరు సెలబ్రిటీలకు కొన్ని విషయాల్లో సంకుచిత దృష్టి ఉంటుంది. హిపోక్రసీ కూడా దాదాపు పీక్స్ లో ఉంటుంది. చాలాసార్లు అది బయటపడుతుంది. ఉదాహరణకు జంతు ప్రేమ పేరుతో పబ్లిసిటీ పొందే చాలామంది కుక్కల మీదే ప్రేమ చూపిస్తారు కానీ మిగతా జంతువుల మీద ఆ ప్రేమ ఎక్కడికి పోతుందో అర్థం కాదు. కుక్క కాలు విరిగితే బాధ ఉంటుంది కానీ మిగతా జంతువులను కబేళాలకు తరలించినా బాధ కలగదు. అదేం లాజిక్కో.

ఇక దీపావళి క్రాకర్స్ విషయం కూడా అంతే.. న్యూ ఇయర్ నాడు.. ఇతర సందర్భాలలో ఎంత బాణాసంచా కాల్చినా సదరు మేథావులు మాట్లాడరు. అయితే దీపావళి అనగానే చాలు సుద్దులు చెప్పేందుకు బయలుదేరతారు. గతంలో ప్రియాంక చోప్రా ఇలానే ఎన్నో నీతులు చెప్పింది. ఇన్ని చెప్పింది కదా.. ఆమె కూడా అదే ఫాలో అవుతుంది అనుకుంటే తన వివాహానికి ఒక ఊరికి సరిపడా బాణాసంచా కాల్చి వేడుక చేసుకుంది. నెటిజన్లు ట్రోలింగ్ చేసి ప్రియాంకకు ఆ సమయంలో చుక్కలు చూపించారు. తాజాగా రకుల్ ఇలానే ఇరుక్కుంది.

దీపావళికి ప్రజలను ఎక్కువ శబ్దం చేసే టపాసులు కాల్చవద్దని.. దీనివల్ల పెంపుడు జంతువులకు.. గూడులేని జీవాలకు ఇబ్బంది కలుగుతుందని ఒక నీతిబోధ చేసింది. భారీ శబ్దం చేసే పటాకుల వల్ల ఇబ్బంది నిజమే. అయితే రకుల్ జనాలకు ఇలాంటి సూక్తులు చెప్తుంది కానీ స్వయంగా మాత్రం ఫాలో కాదు. ఈ విషయం నెటిజన్లు పసిగట్టారు. రకుల్ హీరోయిన్ గా నటించిన ‘జయ జానకి నాయక’ సినిమా రిలీజ్ సమయంలో సూపర్ సౌండ్ వచ్చే క్రాకర్స్ తో పండగ చేసుకుంది. ఆ వీడియోను పోస్ట్ చేసి ‘చెప్పేదొకటి.. చేసేదొకటి’ అంటూ నెటిజన్లు రకుల్ ను ఓ ఆటాడుకుంటున్నారు. అయినా మనం ఫాలో అవ్వని విషయాలు పక్కనవారికి ఎందుకు చెప్పాలి.. వారితో ఎందుకు గడ్డి పెట్టించుకోవాలి?
Please Read Disclaimer