అక్కడ సర్జరీ చేయించుకున్న రకుల్ !

0

‘రకుల్ ప్రీత్ సింగ్’ స్టార్ హీరోయిన్ గా దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. ఎప్పుడు ఆమె అందహీనంగా ఉంది అని ఎవరు కామెంట్ చేయలేదు. కానీ, ఈ బ్యూటీ తానూ పెద్దగా అందంగా ఉండను అని ఫీల్ అవుతూ ఉంటుందట. అందుకే, ఎలాగైనా తన అందాన్ని పెంచుకోవాలని కృత్రిమ మెరుగులు దిద్దుకుంది. ఆమె కొత్త ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా తెగ వైరల్ అవుతుంది.

అయితే, ఈ ఫొటోలో రకుల్ కొత్తగా కనిపిస్తోంది. ముఖ్యంగా రకుల్ పెదవులు మునుపటి కన్నా సరికొత్తగా కనిపిస్తున్నాయి. పైగా పెదవుల ఆకృతి కూడా మారిపోయింది. అన్నిటికి మించి ఆమె దవడ కింద భాగం షేప్ కూడా మారింది. ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే, రకుల్ సీక్రెట్ గా ఫేస్ సర్జరీ చేయించుకుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అయినా హీరోయిన్లకు సర్జరీలు కొత్తేమి కాదు, పెదవుల సర్జరీలు అయితే, దాదాపు అందరూ హీరోయిన్స్ చేయించుకుంటారు. పెదవులు నిండుగా అందంగా కనిపించేందుకు ఈ సర్జరీ చేయించుకుంటారు. నిజానికి ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎక్కువగా ఉంటుంది, అయితే.. సౌత్ లో ఈ ట్రెండ్ ను తీసుకొచ్చింది మాత్రం శృతి హాసనే. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్స్ సర్జరీ చేయించుకున్నారు.

ఇప్పుడు ఆ జాబితాలోకి రకుల్ కూడా చేరింది. రకుల్ కి వయసు ప్రస్తుతం 30 ఏళ్ళు. మరో ఐదేళ్ల లైఫ్ ఉండే అవకాశం ఉంది. పైగా రకుల్ చేతిలో ప్రస్తుతం ఎనిమిది బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఎలాగూ బాలీవుడ్ లో హీరోయిన్ల కొరత బాగా ఉంది. కాబట్టి.. రకుల్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కావాలని ఆశ పడుతుంది. ఈ క్రమంలోనే సర్జరీల వైపు ఆమె చూపు పడింది.