జీవితం తలకిందులు

0

ఒక్క సినిమా రిజల్ట్ తలకిందులైతే జీవితం తలకిందులవ్వాలని రూల్ ఏం లేదు! అయినా ఎందుకీ శ్రమ? అంటారా? ఇది నిరంతర యజ్ఞం. ఇక్కడ ఓటమి ఎదురవుతుంది. గెలుపు వచ్చి వెళుతూ ఉంటుంది. ఒకసారి రేసులో వెనకబడినా ఇంకోసారి ముందుకు ఎలా వెళ్లాలో తెలియాలి. విజయం కోసం నిరంతరం పోరాటం చేయాలి. విజయం వచ్చినప్పుడే అన్నిటినీ చక్కదిద్దుకోవాలి. ఈ విషయంలో అందాల కథానాయిక రకుల్ ప్రీత్ అందరికీ స్ఫూర్తి అనే చెప్పాలి.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఘనవిజయం తర్వాత కెరీర్ ని మలుచుకున్న తీరు.. రకుల్ చాకచక్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఇండస్ట్రీ అగ్ర హీరోలందరి సరసన కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఇరుగు పొరుగు భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. అయితే దాంతో పాటే కెరీర్ పరంగా ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు స్టార్ ఇమేజ్ ని కాపాడుకునేందుకు ఇదిగో ఇలా నిరంతరం యోగా-జిమ్ అంటూ సాధన చేస్తూనే ఉంది.

యోగాసనంలో ఇదో రకం భంగిమ. ఈ ప్రపంచానికి తలకిందులుగా నమస్కారం. అన్షుక ఇచ్చిన శిక్షణ ఇది. తనే లైఫ్ ఛేంజర్! అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఫోటోని అభిమానులకు షేర్ చేసింది. యోగాసనంలో పెర్ఫెక్షన్ చూస్తుంటే రకుల్ ఎంత పెర్ఫెక్ట్ నో అర్థం చేసుకోవచ్చు. వరుసగా ఎన్జీకే.. మన్మధుడు 2 లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. శివకార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తోంది. మర్జావన్ అనే హిందీ చిత్రంలోనూ కథానాయికగా నటిస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home