మన్మథుడు బ్యూటీ మెస్మరైజింగ్ లుక్

0

టాలీవుడ్ లో ఉన్న హాట్ బ్యూటీలలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమధ్య టాలీవుడ్ లో జోరు కొంచెం తగ్గింది కానీ సోషల్ మీడియాలో మాత్రం రివర్స్ లో పెరిగింది. రెగ్యులర్ గా ఫోటో షూట్లు చేస్తూ గ్లామర్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్నానని నిరూపిస్తూ ఉంటుంది. అందుకే ఈ భామ ఎప్పుడూ లైమ్ లైట్ లోనే ఉంటుంది. తాజాగా మరోసారి రకుల్ ఓ ఫోటో షూట్ చేసింది. ఎప్పటి లాగానే డ్రెస్ లో గ్లామరసం దట్టించింది.

శరీరం రంగులో కలిసిపోయినట్టు ఉండే ఒక స్పెషల్ డ్రెస్ ధరించి ఈ ఫోటోలకు పోజిచ్చింది. ఈ డ్రెస్ కు స్లీవ్స్ వెరైటీగా ఉన్నాయి. ఫ్రంట్ విండో ఎంతో కళాత్మకంగా ఉంది. విండోస్ 2020 గ్లామర్ వెర్షన్ అనుకోవాలి. డ్రెస్ పై కొంత భాగం మాత్రం పూల డిజైన్ ఉండడంతో డ్రెస్ చాలా అందంగా కనిపిస్తోంది. పర్ఫెక్ట్ మేకప్ తో.. కొంచెం చిందరవందరగా ఉండే హెయిర్ స్టైల్ తో హీరోయిన్ లాగా కాకుండా ఒక సూపర్ మోడల్ లాగా కనిపిస్తోంది. మంచి ఎక్స్ ప్రెషన్ కూడా ఇచ్చింది. మరి ఇంత హాటుగా ఉన్న భామకు మన తెలుగు మేకర్లు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో. టాలీవుడ్ మేజర్ క్వాలిఫికేషన్ అయిన ‘తెలుగు అమ్మాయి కాకపోవడం’ ఉన్నప్పటికీ ఎందుకు అవకాశాలు తగ్గిపోయాయో.

రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల మాట్లాడుకుంటే కమల్ హాసన్ – శంకర్ సినిమా ‘ఇండియన్ 2’ లో నటిస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కే మరోచిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా హిందీలో కాశ్వీ నాయర్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీ లో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.
Please Read Disclaimer