ఫీజు గట్టిగానే తీసుకుంటోందట!

0

చాలా రోజుల నుంచి వార్తల్లో ఉన్న అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘మన్మధుడు 2’ నిన్నే లాంచ్ అయింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ప్రస్తుతం రకుల్ కు తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు కాబట్టి ఇది మంచి ఆఫరే. ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే మాత్రం ఇది రకుల్ కు జాక్ పాట్ ఆఫర్ అంటున్నారు.

రకుల్ గతంలో స్టార్ హీరోల సినిమాలు చేసిన సమయంలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసేది. కానీ ఈ సినిమాకు మాత్రం డబల్ ఫీజ్ అడిగిందని సమాచారం. సీనియర్ హీరోలకు సూటబుల్ హీరోయిన్లు దొరకడం కష్టం అనేది అందరికీ తెలిసిందే. కొత్త హీరోయిన్ల వయసు మరీ తక్కువ గా ఉంటుంది కాబటి జోడీ కట్టలేరు. కాజల్.. తమన్నా లాంటి వారిని హీరోయిన్ గా తీసుకుంటే రొటీన్ అనిపిస్తుంది. ఈ విషయాలన్నీ గ్రహించే ఎక్కువ ఫీజు అడిగిందట. దీంతో మొదట రకుల్ స్థానంలో పాయల్ పేరును పరిశీలించారట. కానీ కథ ప్రకారం ఆ పాత్రను ఒక స్టార్ హీరోయిన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మళ్ళీ రకుల్ కే ఓటేసి ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. అంటే రెండు సినిమాలు చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ రకుల్ కు ఒక సినిమాతోనే వస్తోంది.

ఈమధ్య రకుల్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. రకుల్ ఈమధ్య నటించిన సినిమాలు కూడా విజయం సాధించడం లేదు. ఇలాంటి సమయంలో ‘మన్మధుడు 2’ ఆఫర్ ఒక క్రేజీ ఆఫర్ అనే చెప్పొచ్చు. ఒకవేళ సినిమా కనుక హిట్ అయితే మళ్ళీ ఫామ్ లోకి రావడం.. అదే ఫీజును కంటిన్యూ చేయడం మాత్రం ఖాయమే!
Please Read Disclaimer