వైరస్ కి అస్సలు భయపడని ఏకైక కథానాయిక?

0

మహమ్మారీ విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయి ఐదు నెలలు దాటింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లను తిరిగి ప్రారంభించుకోవడానికి అనుమతి ఇవ్వడంతో అనేక చిన్న మధ్యతరహా బడ్జెట్ చిత్రాల షూటింగ్లను తిరిగి ప్రారంభించారు.

అయితే పలువురు సెట్స్ లో వైరస్ వల్ల ఇబ్బంది పడడం.. పాజిటివ్ అని తేలడంతో షూటింగుల్ని ఆపిన సంగతి తెలిసిందే. అయినా ఇక వైరస్ తో సహజీవనం తప్పదని భావించే వాళ్లు షూటింగులకు డేర్ చేస్తూనే ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో లాంచ్ అయిన తరువాత ఈ చిత్రం షూటింగ్ వికారాబాద్ ఫారెస్ట్ లో ప్రారంభమైంది. రకుల్ షూటింగ్ తిరిగి ప్రారంభించడంతో చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా ప్రకటిస్తూ… ఆన్ లొకేషన్ గ్రీన్ రూమ్ నుంచి తన మేకప్ కిట్ వీడియోను అభిమానులకు షేర్ చేసింది. “నీవు లేక లోటు గా అనిపించింది. తిరిగి పనికి వెళుతున్నా“ అంటూ రకుల్ ఎమోషన్ అయ్యింది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో రకుల్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం. మహిళా రైతుగా విలేజీ అమ్మాయిగా రకుల్ ఇందులో కనిపించనుందని ప్రచారమవుతోంది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్నారు.