రకుల్ ఎదుగుదలను అడ్డుకుంటున్నారట

0

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలందరితో కూడా నటించింది. ఒక్కరు ఇద్దరు తప్ప అందరు హీరోలు ఈమెతో నటించేందుకు ఆసక్తి చూపించి మరీ ఆమెతో నటించారు. అయితే రకుల్ సందడి రెండేళ్లు మాత్రమే కొనసాగింది. ఆ రెండు సంవత్సరాలు రకుల్ స్టార్ హీరోలకు సైతం దొరకలేదు. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత రెండేళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్ కు టాలీవుడ్ లో ఆఫర్లే కరువయ్యాయి. ఈ సమయంలో కోలీవుడ్ నుండి ఆఫర్లు దక్కించుకుంది. అక్కడ కూడా ఈమెకు సక్సెస్ అనేది చాలా కష్టం అయ్యింది.

ఇటీవలే ఈమె కార్తీతో నటించిన దేవ్ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. ప్రస్తుతం సూర్యతో ఒక సినిమాను చేస్తున్న రకుల్ ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలోనే ఈమె గురించి సోషల్ మీడియాలో రరకాల వార్తలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా అవకాశాలు లేకున్నా కూడా రకుల్ పారితోషికం పెంచేసింది అనేది కీలకమైన పుకారుగా చెప్పుకోవచ్చు. రకుల్ పారితోషికం పెంచేసింది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో చిన్న నిర్మాతలు ఆమెకు దూరంగా ఉంటున్నారు.

ఇలాంటి సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ తన కెరీర్ నాశనంకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. నాపై లేని పోని వదంతులు సృష్టించి నా ఎదుగుదలను అడ్డుకుంటున్నారు అంటూ ఆరోపించింది. తెలుగు తమిళం హిందీల్లో నటించిన అతి కొద్ది మంది హీరోయిన్స్ లో నేను ఒక దాన్ని అని చెప్పుకోవడం నాకు చాలా సంతోషం. ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా లేకున్నా భవిష్యత్తులో బిజీ అయ్యే వారు ఉంటారు. ఎవరు కూడా నా కెరీర్ ను నాశనం చేయలేరు అంటోంది. ఇంతకు ఈ అమ్మడి అక్కస్సు అంత ఎవరిపైనో మరి..
Please Read Disclaimer