గ్లామర్ డోస్ పెంచిన భామ

0

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ జోరు మధ్య కొంత తగ్గిన మాట వాస్తవమే కానీ సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గలేదు. తగ్గడం సంగతి దేవుడెరుగు.. స్పీడ్ పెరిగింది. రకుల్ ఈమధ్య హిందీ సినిమాల్లో నటిస్తూ అక్కడ కెరీర్ సెట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది కాబట్టి బాలీవుడ్ స్పీడుకు తగ్గట్టు గ్లామర్ గేరు వేసేసింది. సూపర్ ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో మంటలు పెడుతోంది.

రకుల్ నటించిన ‘మర్జావా’ నవంబర్ 15 న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడుపుతున్న రకుల్ తన డ్రెస్ స్టైల్ ను మాత్రం వీలైనంత హాటుగా ఉండేలా చూసుకుంటోంది. జస్ట్ అలా కనిపిస్తే మంచి ఫోటోలు రావనుకుందో ఏమో కానీ ఈమధ్య ఒక హాట్ ఫోటో షూట్ చేసింది. మల్టి కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించి పర్ఫెక్ట్ వీ నెక్ తో వయ్యారం ఒలకబోస్తూ ఫోటోలకు పోజిచ్చింది. అతి తక్కువ మేకప్ తో.. చెవులకు వేలాడే రింగ్స్ ధరించి చూపరులను ఆకట్టుకునేలా ఎక్స్ ప్రెషన్స్ పెట్టింది.

సినిమాల విషయానికి వస్తే తెలుగులో రకుల్ కు పెద్దగా ఆఫర్లు లేవు కానీ ఇతర భాషల్లో మాత్రం రకుల్ బిజీగానే ఉంది. తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలోనూ.. కమల్ హసన్ – శంకర్ ‘ఇండియన్ 2’ లోనూ నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా హిందీలో కాశ్వీ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా నటిస్తోంది.
Please Read Disclaimer