సెలవులు కుమ్మేద్దామని ఇస్మార్ట్ ప్లాన్

0

9 ఏప్రిల్ 2020 .. రామ్ లాక్ చేసిన తేదీ ఇది. అతడు నటిస్తున్న ప్రయోగాత్మక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ `రెడ్`ని ఆ రోజు రిలీజ్ చేసేందుకు ఎంతో ముందస్తు ఆలోచనతో అన్నిటినీ సెట్ చేసుకున్నాడు. నవంబర్ 16 నుంచి సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెట్టి మార్చి నాటికే అన్ని పనులు పూర్తి చేయాలన్నది సంకల్పం. నేడు రెడ్ చిత్రీకరణ ప్రారంభోత్సవం చేసింది మొదలు దీనిని ఒక యజ్ఞంగా భావిస్తున్నాడట. అయితే సినిమా ఎంత బాగా తీసినా మంచి రిలీజ్ తేదీ లేకపోతే కష్టం. సక్సెస్ కి రిలీజ్ తేదీ ముఖ్యం అని పరిశ్రమలో అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. ఆ క్రమంలోనే రామ్- స్రవంతి కిషోర్ బృందం మునుపటి కంటే ఎంతో షార్ప్ గా ఆలోచించారు.

అందుకే ప్రారంభోత్సవం రోజునే రిలీజ్ తేదీని ఫిక్స్ చేసుకోగలిగారు. రిలీజైన రెండో రోజు గుడ్ ఫ్రైడే.. ఆ మరునాడే వీకెండ్.. శని ఆదివారాలు కలిసొచ్చాయి. వరుసగా నాలుగు రోజులు వసూళ్లు కుమ్ముకోవచ్చు. రిలీజ్ డే జోరుతో పాటు వీకెండ్ మూడు రోజులు బాగా వసూళ్లు తెచ్చే వీలుంటుంది. సినిమాకి పాజిటివ్ బజ్ తేగలగడంలోనే దర్శకుడు కిషోర్ తిరుమల పనితనం బయటపడాల్సి ఉంటుంది. అయితే దర్శకుడు ఆ ఫీట్ వేయగలడా? ఇన్నాళ్లు ఫ్యామిలీ కంటెంట్ స్నేహం – లవ్ స్టోరి అంటూ సాఫ్ట్ సినిమాలు తీసిన కిషోర్ రామ్ ని మాస్ యాక్షన్ హీరోగా ఏ స్థాయిలో చూపించగలడు? అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకూ రెడ్ తో పోటీపడుతూ రిలీజయ్యే సినిమా ఏదీ లేదు కాబట్టి రామ్ కి కలిసొచ్చే అంశమే. కాలేజ్ స్థాయిలో స్టూడెంట్స్ పరీక్షలు రాసి ఫ్రీ అయ్యే సీజన్ కావడం మరో ప్లస్ అవుతుందని విశ్లేషిస్తున్నారు.

ఈ తరహా జోనర్లకు పూరి-బోయపాటి లాంటి వాళ్లకే ట్రాక్ రికార్డ్ ఉంది. అయితే కిషోర్ తిరుమల రామ్ పాత్రకు ఇచ్చిన మాస్ టచ్ ఎంత ఘాటుగా ఉండబోతోంది? అన్నది చూడాలి. పోస్టర్ చూడగానే ఇదో ప్రయోగమే అనుకున్నారంతా. మరి దర్శకుడి పనితనం ఏ మేరకు చూపిస్తారు? అన్నది ఇప్పటికి సస్పెన్స్. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ మరో ప్రయోగమే చేస్తున్నాడు. మణిశర్మ లాంటి సీనియర్ సంగీతం అందిస్తున్నారు కాబట్టి అది అతడికి ప్లస్. ఇక ఈ సినిమాని ఓ తమిళ సినిమా స్ఫూర్తితో తీస్తున్నారు అన్న చర్చా సాగుతోంది. దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer