సూపర్ క్యూట్ మరిదిగా రామ్

0

టాలీవుడ్ లో చాలామందే హీరోలు ఉంటారు కానీ వారిలో ఫుల్ ఎనర్జీతో ఉండే హీరోలు చాలా తక్కువమంది. అలాంటివారిలో రామ్ ఒకరు. అందుకే ‘ఎనర్జిటిక్ స్టార్’ అనే బిరుదును ఇచ్చేశారు తెలుగుప్రేక్షకులు. పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్ అంటారు చూడండి.. రామ్ దగ్గర అంత టాలెంట్ ఉంది. గత కొంతకాలంగా పరాజయాలతో డీలా పడ్డాడు కానీ రీసెంట్ ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఒక్కసారిగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.

రామ్ ఈ జెనరేషన్ హీరో కాబట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఏదైనా అప్డేట్ ఉన్నా.. ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నా అభిమానులతో పంచుకుంటాడు. ఈరోజు రామ్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక లవ్లీ ఫోటో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోకు “ప్రియమైన వదినా.. హ్యాపీ బర్త్ డే!!! ఈ లవ్లీ అకేషన్ లో నిన్ను ఇబ్బంది పెట్టాలని నేను ఈ ఫోటో పోస్ట్ చేస్తున్నాను” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ఈ ఫోటోలో రామ్ వదిన ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తూ అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేస్తున్న తరహాలో చేతులను పెట్టింది. రామ్ సిగ్గుపడుతూ చిరునవ్వుతో వదిన భుజంపై తలను ఆన్చాడు. హోటల్ లో ఉండడంతో ఇద్దరి ముందు ప్లేట్లు ఉన్నాయి. అయినా వదిన ఏ మరిదికైనా ఏ విషయంలో ఉపదేశం ఇస్తుంది? దాదాపుగా అది మ్యారేజికి సంబంధించినదే అయి ఉండొచ్చు. ఇస్మార్ట్ మరిదీ.. త్వరగా పెళ్ళి చేసుకోమని చెప్తుంటే ఆ బాధ పడలేక.. తిరిగి ఏమీ అనలేక అలా బుక్కయినట్టున్నాడు రామ్. నెటిజన్లలో కొందరు ఇదే అనుమానం వ్యక్తం చేయడం విశేషం. ఇక చాలామంది వదినకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే ఫోటో మాత్రం సూపర్ క్యూట్ కదా?
Please Read Disclaimer