మెగా 152 : మళ్లీ అవే వార్తలు.. నిజం కావచ్చేమో!

0

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. మొన్నటి సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో ఈ చిత్రంను ఖచ్చితంగా 99 రోజుల్లో పూర్తి చేస్తాను అంటూ జనాల సాక్షిగా చిరంజీవికి దర్శకుడు కొరటాల శివ హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. అలా పూర్తి అయితే మాత్రం సినిమా ఖచ్చితంగా సమ్మర్ చివర్లో లేదా దసరా వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం గురించి మొదటి నుండి కూడా ఒక ఆసక్తికర పుకారు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూనే ఉంది.

అదేంటీ అంటే ఈ చిత్రంలో రామ్ చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడు. చిరంజీవి యంగ్ ఏజ్ పాత్రకు కొద్ది సేపు రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అని.. ఈ చిత్రానికి చరణ్ కనిపించడమే ప్రధాన ఆకర్షణ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ వార్త పదే పదే మీడియాలో వస్తూనే ఉంది. ఏదైన ఒక పుకారు ప్రచారం జరిగితే కొన్నాళ్ల తర్వాత దాన్ని అంతా మర్చి పోతారు. మళ్లీ అది వార్తల్లోకి రాదు. కాని ఈ సినిమాలో చరణ్ అనే వార్త మాత్రం మళ్లీ మళ్లీ వస్తున్న కారణంగా నిజంగానే మెగా 152లో చరణ్ ఉంటాడా అనే ఆశ పడుతున్నారు.

సైరా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న చిరంజీవి చాలా స్పీడ్ గా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు కొరటాల శివ తెరకెక్కించిన ప్రతి సినిమా సమాజంలోని ఏదో ఒక ఇష్యూపై ఫైటింగ్ తో ఉంది. అలాగే ఈ చిత్రం కూడా దేవాదాయ శాఖలో ఉన్న అవినీతి గురించి ఉంటుందని… అలాగే కమర్షియల్ గా కూడా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. త్రిష హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని వార్తలు వచ్చాయి. హీరోయిన్ విషయంలో కన్ఫర్మ్ న్యూస్ రావాల్సి ఉంది. చరణ్ ఈ చిత్రాన్ని మ్యాట్నీ మూవీస్ వారితో కలిసి నిర్మిస్తున్నాడు.
Please Read Disclaimer