ఆర్ఆర్ఆర్ చెప్పిన ఆరు సూత్రాల వీడియో చూశారా?

0

నిలువెల్లా వణికిస్తున్న కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు.. మిగిలిన దేశాల్లో మాదిరి మన దేశంలో.. అందునా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించకుండా ఉండేందుకు సినీ ప్రముఖులు నడుంబిగించారు. కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కలిగించేందుకు ఇద్దరు టాలీవుడ్ ప్రముఖులు రంగంలోకి దిగారు. ఎప్పుడా మరెప్పుడా అని ఎదురుచూస్తున్న దర్శక ధీరుడు రాజమౌళి క్రేజీ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ చిత్ర కథానాయకులు తారక్.. చెర్రీలు ఒకే వేదిక మీద నుంచి కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా కొన్ని కీలక సూచనలు చేవారు.

కరోనా నివారణకు ఏ మందు లేని వేళ.. ఆ వైరస్ ను ఎలా అడ్డుకోవాలో ఆరు సూత్రాల్లో చెప్పేశారు. వీరిద్దరూ కలిసి చేసిన కరోనా వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు అనుసరించాల్సిన ఆరు సూత్రాలంటూ తారక్.. రాంచరణ్ ఏమేం చెప్పారన్నది చూస్తే..

1. రెండు చేతుల్ని.. గోళ్లను రోజులో వీలైనన్నిసార్లు శుభ్రంగా కడుక్కోండి. బయటకు వెళ్లి వస్తే.. చేతులు కడుక్కోవటం చాలా ముఖ్యం.

2. షేక్ హ్యాండ్స్ మానేయండి. కౌగిలింతల్ని పక్కన పెట్టండి. కళ్లు.. ముక్కు.. నోట్లోకి వేళ్లు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి

3. తుమ్మినప్పుడు.. దగ్గినప్పుడు అర చేతిని కాదు మోచేతిని అడ్డుగా పెట్టుకోండి. పొడిదగ్గు.. జ్వరం.. జలుబు లాంటివి ఉంటే మాస్కులు ధరించండి.

4. జనం ఎక్కువగా ఉండే చోటుకు వెళ్లకండి. మంచినీళ్లు ఎక్కువగా తాగండి. గోరువెచ్చని నీళ్లు అయితే మరింత మంచిది. ఒకేసారి గబగబా కాకుండా నెమ్మదిగా మంచినీళ్లు తాగటం మంచిదే.

5. వాట్సాప్.. సోషల్ మీడియాలో వచ్చే అప్డేట్స్ ను.. క్లిప్పుల్ని అదే పనిగా షేర్ చేయకుండా.. జాగ్రత్తగా మాత్రమే ఫార్వర్డ్ చేయండి. అనవసరమైన ఆందోళనకు గురి చేసే సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దు.

6. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్ సైట్ లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోండి. వారు చేసే సూచనల్ని పాటిద్దాం. సలహాల్ని అనుసరిద్దాం. పరిశుభ్రంగా ఉండి సురక్షితంగా ఉందాం. మనల్ని మనమే కాపాడుకుందాం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-