దగ్గుబాటి వివాహ వేడుకల్లో చరణ్-ఉపాసన

0

విక్టరీ వెంకటేష్ డాటర్ ఆశ్రిత వివాహం వినాయక్ తో జైపూర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాహం పూర్తిగా ప్రైవేటు కార్యక్రమంగా సాగడంతో ఫోటోలు చూడలేకపోయామని అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఇప్పుడు చరణ్ సతీమణి ఉపాసన ఆ లోటు తీర్చేసింది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా నాలుగు ఫోటోలు పోస్ట్ చేసి అభిమానులను సంతోషపెట్టింది.

‘కంగ్రాచ్యులేషన్స్ వెంకీ అంకుల్.. నీరు ఆంటీ.. ఆశ్రిత & వినాయక్. అందరికీ అల్ ది బెస్ట్. రానా దగ్గుబాటి.. Mr. C మీరిద్దరూ సూపర్’ అంటూ ట్వీట్ చేసింది ఉపాసన. ఒక ఫోటోలో వధూవరులతో పాటుగా వెంకటేష్.. ఆయన సతీమణి నీరజ ఉన్నారు. వారితో చరణ్ – ఉపాసన జంట పోజిచ్చారు. మరో ఫోటోలో రానా.. చరణ్ లతో పాటు ఉపాసన ఉంది. మరో ఫోటోలతో మాత్రం Mr & Mrs C మాత్రమే ఉన్నారు. అసలే సెలబ్రిటీ వివాహం కాబట్టి అందరూ డిజైనర్ డ్రెస్సులలో తళుక్కున మెరిశారు. ముఖ్యంగా రానా మాత్రం పెదరాయుడు గెటప్ లో గుబురు గెడ్డంతో డిఫరెంట్ గా ఉన్నాడు.

ఈ ఫోటోలకు సోషల్ మీడియాలు లైకులు మీద లైకులు పడిపోతున్నాయి. చరణ్.. రానాలు క్లోజ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.. ఈ ఫోటోలలో మిస్ అయిన వారు రానా కజిన్ చైతు.. చైతు సతీమణి సమంతా. ఇక చినబాబు అఖిల్ కూడా. త్వరలో ఆ ఫోటోలు కూడా వచ్చేస్తాయి లెండి.
Please Read Disclaimer