మొన్నే పెళ్లి చేసుకున్నట్టు ఉంది!

0

టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో రామ్ చరణ్ – ఉపాసన జంట నిరంతరం ఏదో ఒక టాపిక్ తో ఫ్యాన్స్ కి టచ్ లోనే ఉంటున్నారు. అపోలో హెల్త్ మ్యాగజైన్ సీఈవో కం ఎడిటర్ గా ఉపాసన రామ్ చరణ్ నిరంతరం సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో టచ్ లో ఉన్నారు. ఇకపోతే చరణ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా భార్య ఉపాసన తో కలిసి రకరకాల వెకేషన్స్ పేరుతో సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తుంటారు. ఈసారి ఏడో వివాహవార్షికోత్సవం సందర్భంగా చాలా ముందస్తుగానే ఉపాసన సమేతంగా చరణ్ ఆఫ్రికా టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎప్పటిలానే రొటీన్ కి భిన్నంగా ప్లాన్ చేశారు. ఆఫ్రికా అడవుల్లో క్రూర జంతువులు నడియాడే చోటికి నేరుగా వెళ్లిపోయారు ఈ జంట. అక్కడ పులులు- సింహాలతో సెల్ఫీలు దిగిన ఫోటోలు ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.

నేడు చెర్రోపాసన వెడ్డింగ్ డే సందర్భంగా ఉదయం నుంచి సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీమీడియా విషెస్ అందజేసింది. అలాగే చరణ్ – ఉపాసన ఫాలోవర్స్ .. ఫ్యాన్స్.. బంధువుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉపాసన సామాజిక మాధ్యమాల్లో ఈ వేడుక గురించి స్పందించారు. “హ్యాపీ యానివర్శరీ టు అజ్..! (ఇన్ అడ్వాన్స్).. ప్రతి యేటా లానే ఈసారి కలిసి డిఫరెంట్ గా ప్లాన్ చేశాం. డైవింగ్.. అడ్వెంచర్ స్పోర్ట్స్.. హీలింగ్ టెక్నిక్స్ నేర్చుకోవడం.. లాంటి పనులు చేశాం. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీతోనూ బిజీగానే గడిపాం. ఈ అకేషన్ ఎంతో గొప్పగా నచ్చింది.. అని అన్నారు. “ఏడేళ్లు అప్పుడే గడిచిపోయాయా అన్నట్టే ఉంది. ఇంకా 30లలోనే ఉన్నట్టుగా ఉంది. ఇంకా బకెట్ల కొద్దీ పనులు చేయాల్సినవి చాలానే ఉన్నాయి“ అంటూ కాస్త సీరియస్ గానే వ్యాఖ్యానించారు ఉపాసన.

ఆర్.ఆర్.ఆర్ షెడ్యూల్స్ వల్ల చరణ్ -ఉపాసన జోడీ ముందస్తుగా విదేశీ టూర్ వెళ్లారు. ఇక 2011 డిసెంబర్ లో ఈ జంటకు నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. అటుపై 2012 జూన్ లో వివాహం చేసుకున్నారు. నేటి ఏడో వెడ్డింగ్ యానివర్శరీని ఎంతో ఆహ్లాదంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ జంట.