పవన్ కు చరణ్ ఓదార్పు

0

జనసేన ఓటమి ముందే ఊహించిందే కాని మరీ ఇంత దారుణంగా అయితే కాదు. అందుకే అభిమానులకు ఇది ఎంత ట్రై చేసినా జీర్ణం కావడం లేదు. పార్టీ అధినేత హోదాలో కనీసం ఒక్క స్థానంలో గెలిచినా తమ హీరో అసెంబ్లీకి వెళ్తున్నాడని సంతోషించే వారు. కాని అదీ దక్కలేదు. వీళ్ళ సంగతి ఏమో కాని పవన్ దీని లైట్ తీసుకుని పార్టీ సభ్యులతో నవ్వుతు కార్యాలయంలో తీసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చేసింది.

బాబాయ్ ని అమితంగా ఇష్టపడే రామ్ చరణ్ మాత్రం ఈ ఫెయిల్యూర్ కి బాగా ఫీలవుతున్నాడు. ఇందాకా ఫేస్ బుక్ లో దీని గురించి మెసేజ్ పెడుతూ పవన్ కు కాస్త జోష్ ఇచ్చేలా ఫ్యాన్స్ కొంత రిలీజ్ అయ్యేలా ఓ రెండు మోటివేషన్ కోట్స్ పెట్టె ప్రయత్నం చేశాడు. దాని ప్రకారం నిజమైన నాయకులు లీడర్లు కావాలని కోరుకోరని కేవలం సమాజంలో మార్పు కోసం వస్తారని చెప్పాడు. అంతే కాదు ఇది పాత్ర గురించి కాదని లక్ష్యం గురించని మరో మాట కూడా అన్నాడు.

జనసేన కోసం ఎనలేని సేవ చేసిన ప్రతి ఒక్కరికి ఇందులో థాంక్స్ చెప్పిన చరణ్ మొత్తానికి సైరా ప్రమాదం తర్వాత మళ్ళి సోషల్ మీడియాలో ఇలా ప్రత్యక్షమయ్యాడు. ఇది మెగా ఫాన్స్ కు ఊరట కలిగించడం కోసమే అయినా దీని వల్ల ఒరిగేది ఏమి లేదు. ఇంకో ఐదేళ్ళు ఆగితే కాని ఎన్నికలు రావు. అప్పటిదాకా రిలాక్స్ అవ్వడం తప్పించి జనసేన చేసే కార్యాచరణ ఏముంటుందనేది ఆసక్తిరమే. సరే కనీసం చరణ్ ఒక్కడు ఈ మాత్రం ఒదార్పైనా ఇచ్చాడు కదా మెగాభిమానులు దీన్నే షేర్ చేసుకుంటున్నారు
Please Read Disclaimer