హ్యాపి బర్త్ డే మై ప్రిన్సెస్! -చెర్రీ

0

ఉపాసన- రామ్ చరణ్ జంట ఇటీవలే వెడ్డింగ్ యానివర్శరీ సెలబ్రేషన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి రోజుకి ముందే ఉపాసనకు ఆఫ్రికాలో వైల్డ్ లైఫ్ టూర్ తో బిగ్ ట్రీట్ ఇచ్చాడు చరణ్. అది పెళ్లి రోజు ట్రీట్. మరి బర్త్ డే ట్రీట్ ఏమిటి? అంటే ఇదిగో ఈ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది.

ఈ శనివారం ఉపాసన బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ కొద్ది మంది స్నేహితులు-బంధుమిత్రుల సమక్షంలో ఇలా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ఉపాసనను చెర్రీ ఎంతో ప్రేమగా పిలవడం ఆకట్టుకుంది. తాజాగా ఈ ఫోటోల్ని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసిన చరణ్ సతీమణిని ఎంతో లవ్ లీగా పిలిచేశారు “హ్యాపి బర్త్ డే మై ప్రిన్సెస్!! గాడ్ బ్లెస్ యు.. ప్రేమతో సంతోషంతో ఈ శుభాకాంక్షలు చెబుతున్నా“ అని వ్యాఖ్యానించారు. దానికి ప్రతిస్పందిస్తూ ఉపాసన అంతే ముద్దుగా చెర్రీని పిలిచేశారు. “థాంక్యూ మై ప్రిన్స్. నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించలేను!“ అని రిప్లయ్ ఇచ్చారు.

చరణ్ – ఉపాసన మధ్య చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఆ స్నేహం ప్రేమగా మారింది. అటుపై 2011లో చరణ్ – ఉపాసన జంటకు నిశ్చితార్థమైంది. 2012లో వివాహం చేసుకున్నారు. ఏడేళ్ల బంధం గురించి తెలిసిందే. ప్రతిసారీ ఏ సెలబ్రేషన్ కి అవకాశం ఉన్నా ఈ జంట అస్సలు విడిచిపెట్టరు. లైఫ్ ఈజ్ ఏ సెలబ్రేషన్ అనేందుకు ఇదిగో ఈ వీడియోనే సాక్ష్యం. చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిన్న బ్రేక్ ఇచ్చినా తిరిగి పూణే- హైదరాబాద్ పరిసరాల్లో షెడ్యల్స్ కి ప్లాన్ చేస్తున్నారట.
Please Read Disclaimer