రామ్ చరణ్ టేస్ట్ అదిరింది

0

ఈమద్య కాలంలో స్టార్ హీరోలు.. చిన్న హీరోలు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ లు ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. వారి సొంతంగా కాకున్నా వారికి సంబంధించిన వారితో అయినా నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేయించి తమ సినిమాలనే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ కూడా కొణిదెల ప్రొడక్షన్స్ ను ప్రారంభించిన విషయం తెల్సిందే. అయితే ఇప్పటి వరకు ఈ బ్యానర్ లో తన తండ్రితో మాత్రమే సినిమాలు తీశాడు. ప్రస్తుతం కూడా తన తండ్రి చిరంజీవితోనే సినిమాను నిర్మిస్తున్నాడు. మొదటి సారి మరో హీరోతో కొణిదెల ప్రొడక్షన్స్ లో సినిమా నిర్మాణం జరుగబోతుందట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మలయాళంలో సూపర్ హిట్ అయిన చిన్న సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’ చిత్రాన్ని రామ్ చరణ్ రీమేక్ చేయబోతున్నాడట. అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న కాన్సెప్ట్ ఓరియంట్ మూవీగా డ్రైవింగ్ లైసెన్స్ నిలిచింది. సినిమాను గురించి సన్నిహితుల ద్వారా తెలుసుకున్న రామ్ చరణ్ ఆ సినిమాను చూసి వెంటనే కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ సినిమా గురించి తెలిసిన వారు.. ఆ సినిమాను చూసిన వారు ఒక మంచి సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ తీసుకున్నాడు.. మంచి అభిరుచి కలిగిన నిర్మాతగా ఈ రీమేక్ తో చరణ్ పేరు తెచ్చుకుంటాడు అంటూ ఆ సినిమా చూసిన వారు అంటున్నారు. హీరోగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఊపిరి కూడా తీసుకోలేనంత బిజీగా ఉన్న చరణ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంతో ఆయన టేస్ట్ ఏంటో తెలిసి పోయిందంటున్నారు. ఈ సినిమాను ఏ హీరోతో రీమేక్ చేస్తాడు.. ఎవరి దర్శకత్వం లో అనేది త్వరలో వెళ్లడి చేసే అవకాశం ఉంది.
Please Read Disclaimer