ఆ పుకారు సగమే నిజమన్న రామ్ చరణ్

0

ఒకవైపు హీరోగా పెద్ద సినిమాల్లో నటిస్తూ మరో వైపు వరుసగా రామ్ చరణ్ సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే తండ్రితో ఖైదీ నెం.150 మరియు సైరా నరసింహారెడ్డి చిత్రాలు నిర్మించిన చరణ్ ప్రస్తుతం చిరు 152 చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుంది. ఇక చిరంజీవి 152 మరియు 153 చిత్రం గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో కూడా చరణ్ కీలక పాత్ర పోషించబోతున్నాడు అనేది ఆ వార్తల సారాంశం.

దీపావళి సందర్బంగా మీడియాతో ముచ్చటించిన రామ్ చరణ్ ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. మొదటగా చిరంజీవి 152వ చిత్రంలో తాను నటిస్తున్న మాట వాస్తవం కాదని.. ప్రస్తుతం ఇంకా కథ చర్చల దశలో ఉంది. కథ ఓకే అయిన తర్వాత అందులో నాకు తగ్గట్లుగా ఏమైనా పాత్ర ఉందని వారు భావిస్తే.. నాన్నగారు చేయమంటే అప్పుడు చేస్తానంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. దీంతో మెగా 152లో చరణ్ లేనట్లే అంటూ క్లారిటీ వచ్చేసింది.

ఇక మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ కొనుగోలు చేశాడని.. అందులో చిరంజీవి మరియు చరణ్ కలిసి నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై స్పందిస్తూ లూసీఫర్ రీమేక్ రైట్స్ కొనుగోలు చేసిన మాట వాస్తవమే అయినా కూడా ఆ సినిమాలో నటించబోతున్నది ఎవరు.. ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని.. కాస్త సమయం పట్టే అవకాశం ఉందని ఈ సందర్బంగా చరణ్ చెప్పుకొచ్చాడు.

గత రెండు రోజులుగా చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతున్న ఆ పుకార్ల విషయమై చరణ్ అసలు విషయాలు చెప్పేశాడు. ప్రస్తుతం ఈయన జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని చేస్తున్నాడు. రామ్ చరణ్ తో కలిసి ఆ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.
Please Read Disclaimer