ఫస్ట్ పోస్ట్.. అమ్మతో ఫోటో.. సో స్వీట్

0

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఖాతా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తన ఖాతాలో ఒక ఫోటో ఉన్నప్పటికీ అది ప్రొఫైల్ పిక్. ఈ రోజు తన ఇన్స్టా ఖాతా ద్వారా ఫస్ట్ పోస్ట్ పెట్టాడు. అమ్మగారు సురేఖతో కలిసి ఉన్న..”అప్పుడు ఇప్పుడు” టైపు ఫోటోను పోస్ట్ చేశాడు. ఒకటేమో చరణ్ చిన్నబాబు ఉన్నప్పుడు.. రెండో ఫోటో లేటెస్ట్. కంపారిజన్ పిక్ లాంటిది.

ఈ ఫోటోలో చరణ్ “కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. నా మొదటి పోస్ట్ ను నీకు అంకితం ఇస్తున్నాను. లవ్ యూ అమ్మా. #అమ్మకూచి #ఎప్పటికీ” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. పాత ఫోటోలో ఇద్దరూ చిరునవ్వుతో ఉంటే.. లేటెస్ట్ పిక్ లోమాత్రం పెద్దగా నవ్వుతూ ఉన్నారు. ఈ ఫోటోను జస్ట్ అరగంట క్రితమే పోస్ట్ చేసినా వెంటనే జనాలు లైకులతో హోరెత్తించారు. అప్పుడే దాదాపు లక్ష లైకులు వచ్చాయి.. 2000 కామెంట్లు పెట్టారు. ఈ ఫోటోకు మంచు లక్ష్మి కూడా ఒక లైక్ వేసుకుంది. “సూపర్ పోస్ట్ అన్నా”.. “సో స్వీట్ చెర్రీ”.. “పిక్ ఆఫ్ ది డే” అంటూ అభిమానులు కామెంట్లు పెట్టారు.

చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘RRR’ షూటింగ్ కు ఒక స్మాల్ బ్రేక్ ఇవ్వడంతో ‘సైరా’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటుగా ఫ్యామిలీతో కూడా చిల్ అవుట్ అవుతున్నాడు.
Please Read Disclaimer