రామ్ చరణ్ లాజిక్ సరిపోవడం లేదే!

0

మెగాస్టార్ చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ ‘సైరా’ ను భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం. జయాపజయాల సంగతి పక్కన పెడితే ఈ సినిమా చిరు కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం. అయితే నార్త్ లో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ నిరాశపరిచాయి. హిందీ వెర్షన్ విషయంలో ‘సైరా’ టీమ్ వేసుకున్న అంచనాలు తప్పాయి. రీసెంట్ గా చరణ్ ‘సైరా’ హిందీ వెర్షన్ ఫలితంపై స్పందిస్తూ ‘వార్’ తో పోటీ కారణంగానే ఆశించిన కలెక్షన్స్ రాలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అయితే చరణ్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘సైరా’ హిందీ వెర్షన్ ఫలితానికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ ‘బాహుబలి’.. ‘కేజీఎఫ్’ తరహాలో సోలో రిలీజ్ దక్కకపోవడం వల్లే ‘సైరా’ విజయం సాధించలేదు అన్నట్టుగా చరణ్ వ్యాఖ్యానించడం సరికాదంటున్నారు. ‘బాహుబలి’ కి సోలో రిలీజ్ దక్కిన మాట నిజమే కానీ ‘కేజీఎఫ్’ మాత్రం అన్ని చోట్లా ఫుల్ కాంపిటీషన్ లో రిలీజ్ అయింది. హిందీలో ఏకంగా షారూఖ్ ఖాన్ నటించిన ‘జీరో’ తో పోటీపడి మరీ గెలిచింది. ‘సైరా’ కు పోటీ వల్ల కొంతశాతం కలెక్షన్స్ తగ్గాయి అంటే అది నమ్మదగిన విషయం అవుతుంది.. కానీ పొటీవల్లే సినిమా పరాజయం పొందడం అనేది నమ్మేలా లేదు.

మరోవిషయం ఏంటంటే.. చరణ్ చాలాకాలంగా కలెక్షన్స్ ప్రకటించడానికి వ్యతిరేకంగా ఉంటున్నారు. అలానే ‘సైరా’ కలెక్షన్స్ కూడా అధికారికంగా పోస్టర్లపై వెయ్యలేదు. ఈ విషయంలో చరణ్ ఒక మంచి సంప్రదాయాన్ని ప్రారంభించారని చాలామంది ప్రశంసిస్తున్నారు. అయితే చరణ్ ఈ ఇంటర్వ్యూలో ‘సైరా’ కు సౌత్ లోనే 275 కోట్లు వచ్చాయని చెప్పడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. కలెక్షన్స్ సంగతి మాట్లాడను అంటూనే కలెక్షన్స్ గురించి మాట్లాడడం సరికాదని నెటిజన్లు అంటున్నారు.
Please Read Disclaimer