చరణ్ ఇప్పట్లో క్లారిటీ ఇచ్చేలా లేడుగా..!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం లో నటిస్తున్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం షూటింగ్ జూన్ లేదా జులై వరకు పూర్తి అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఇదే సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలు పెట్టబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఎన్టీఆర్ తదుపరి చిత్రం క్లారిటీ వచ్చినా రామ్ చరణ్ మాత్రం తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. నిన్న మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ చిత్రం తో పాటు ఆచార్య చిత్రంలో కూడా కీలక పాత్ర లో కనిపించే అవకాశం ఉందని అన్నారు. కాని జక్కన్న మూవీ పూర్తి అయ్యే వరకు మరే సినిమాలో నటించకూడదని ఒప్పందం చేసుకున్నారట. ఆ కారణంగా ఆచార్య మూవీలో నటించడం లేదని తెలుస్తోంది. దాంతో చరణ్ తదుపరి చిత్రం గురించి మళ్లీ ఆలోచన మొదలైంది.

ఇప్పటికే చరణ్ కు గౌతమ్ తిన్ననూరి నుండి మొదలుకుని సుజీత్ వరకు పలువురు దర్శకులు కథలు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. పలు కథలకు ఈయన ఓకే చెప్పాడని సమాచారం ఉంది. కాని ఏ సినిమాను మొదట చేస్తాడు అనేది క్లారిటీ లేదు. ఒక వైపు ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తూనే మరో వైపు ఆచార్య నిర్మాణ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నాడు. ఆ కారణంగానే మరో సినిమా ప్రకటనపై ఆసక్తి చూడలేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఈ రెండు సినిమాల నుండి కనీసం ఒక్కదాని నుండైనా రిలీఫ్ అయ్యే వరకు తదుపరి చిత్రం గురించి చరణ్ ఆలోచించే అవకాశం లేదని అంటున్నారు. చరణ్ తదుపరి చిత్రం విషయంలో ఇప్పట్లో క్లారిటీ అయితే వచ్చేలా కనిపించడం లేదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-