RRR సెట్లో చరణ్ కి మరోసారి గాయం?

0

RRR చిత్రాన్ని జక్కన్న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2020 జూలై 30 రిలీజ్ తేదీని లాక్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టుకి ఆరంభం నుంచి ఏదో ఒక అడ్డంకి తప్పడం లేదు. ఒకసారి రామ్ చరణ్ కి గాయమైంది. ఇంకోసారి ఎన్టీఆర్ గాయపడ్డారు. ఆ రెండు సందర్భాల్లో షూటింగ్ ని వాయిదా వేశారని ప్రచారమైంది. ఆ ఘటనలకు ముందే ఈ సినిమాలో నటించాల్సిన విదేశీ నటి డైసీ ఎడ్గార్ ఊహించని విధంగా ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఇటీవలే మరో కథానాయిక ఆలియా భట్ సరిగా చిత్రయూనిట్ కి సహకరించడం లేదని వార్తలొచ్చాయి.

అయితే ఇలాంటి అడ్డంకుల నడుమ ఈ భారీ ప్రాజెక్టును రాజమౌళి ఎలా నెట్టుకొస్తున్నారో అంటూ అభిమానులు ఆసక్తిగా ముచ్చటించుకున్నారు. అన్నిటినీ ఎదురొడ్డి మొత్తానికి షూటింగ్ ని ముందుకు నడిపిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ కి సెట్లో మరోసారి గాయం అయ్యిందని తెలుస్తోంది. అయితే ఈసారి గాయం చాలా చిన్నదే. మరీ అంత పట్టించుకోవాల్సినంత పెద్ద గాయం కాదట. అసలేం జరిగింది? అని ఆరా తీస్తే .. చరణ్ ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దానికోసం డ్యాన్స్ మూవ్ మెంట్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాలు స్లిప్పయి వెనక్కి పడిపోయారట. మరీ భయపడేంత ప్రమాదం కాదని తెలుస్తోంది.

అయితే దీనికి సంబంధించి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. స్వాతంత్య్రం రాకముందు అల్లూరి సీతారామరాజు- కొమరం భీమ్ కలిసి ఉంటే ఏం జరిగేది? అన్నది ఫిక్షన్ కథతో తెరపై చూపిస్తున్నామని దర్శకరచయితలు వెల్లడించిన సంగతి తెలిసిందే.




Please Read Disclaimer