చిరు మాటే చరణ్ మాట కూడా

0

మెగాస్టార్ చిరంజీవి నిన్నటి సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా బడ్జెట్ గురించి.. నిర్మాత శ్రేయస్సు గురించి మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. హీరో తన పారితోషికంను సినిమా పూర్తి అయిన తర్వాత తీసుకుంటే నిర్మాతకు చాలా కలిసి వస్తుందని.. ఆర్థికపరమైన ఇబ్బందులు నిర్మాత ఎదుర్కోడు అన్నాడు. తాను గతంలో సినిమా పూర్తి అయిన తర్వాతే పారితోషికం మొత్తం తీసుకునే వాడిని అన్నాడు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా చాలా తక్కువ సమయంలో పూర్తి అవ్వడం నాకు ఆశ్చర్యంను కలిగించింది. ఇంత తక్కువ సమయంలో సినిమాలు పూర్తి చేయగలిగితే నిర్మాతకు చాలా వృదా ఖర్చు తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

నేడు విజయవాడ లో మొబైల్ స్టోర్ ప్రారంభించేందుకు వెళ్లిన రామ్ చరణ్ మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకకు నాన్న చిరంజీవి వెళ్లడం శుభపరిణామం అన్నాడు. ఇక తక్కువ సమయంలో షూటింగ్స్ ను పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని.. ఆ విషయాన్ని నేను నాన్నతో ఏకీభవిస్తాను అన్నాడు. తక్కువ సమయంలోనే షూటింగ్స్ పూర్తి చేసేలా ప్లానింగ్ చేయాలంటూ డైరెక్టర్స్ కు చరణ్ సలహా ఇచ్చాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉందన్నాడు. షూటింగ్ 65 శాతం పూర్తి అయ్యిందని చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ పరిధి చాలా పెరిగింది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ నుండి నటీనటులు ఇక్కడకు వచ్చి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటప్పుడు మనం బాలీవుడ్ వెళ్లాలని ఎందుకు అనుకోవాలని చరణ్ అన్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోల మద్య స్నేహ వాతావరణం ఉండటం మంచి పరిణామం అంటూ చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Please Read Disclaimer