చెల్లి మీద రామ్ చరణ్ ప్రేమ

0

నిన్న సైరా మేకింగ్ వీడియో అభిమానుల్లో ఫుల్ జోష్ ని నింపేసింది. ఇదే ట్రైలర్ రేంజ్ లో ఉంటే ఇక ఆ వీడియో వచ్చాక రచ్చ ఏ విధంగా ఉంటుందో అని ఇప్పటినుంచే భారీ అంచనాలు పెట్టేసుకుంటున్నారు. 20వ తేదీ ఎంతో దూరంలో లేదు కాబట్టి టీజర్ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఎలివేషన్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా మేకింగ్ వీడియోలో కీలకమైన ఆర్టిస్టులందరిని రివీల్ చేసిన తీరు బాగా ఆకట్టుకున్న అంశాల్లో ఒకటి.

అందులో భాగంగా మెగా డాటర్ నీహారికను సైతం చూపించేశారు. అంతేకాదు తన పేరు మీద ఓ టైటిల్ కార్డు కూడా ఇచ్చారు. దీని గురించి నీహారిక చాలా షాకింగ్ అండ్ స్వీట్ సర్ప్రైజ్ గా ఫీలవుతోంది. దానికి కారణం లేకపోలేదు. అది కూడా తనే షేర్ చేసింది. తన ఎగ్జైట్ మెంట్ ని అభిమానులతో షేర్ చేసుకుంది.

ఇందులో నీహారిక కనిపించేది కేవలం రెండు నిమిషాలలోపే. అది కూడా ఒక వార్ సీన్ లో అలా కనిపించి ఇలా వెళ్లిపోతుందన్న మాట. కానీ మేకింగ్ వీడియోలో చెల్లి కూడా హై లైట్ అవ్వాలనే ఉద్దేశంతో చరణ్ ప్రత్యేకంగా ఎడిటింగ్ టీమ్ కి సూచన చేసి మరీ వచ్చేలా చేశాడు. దీంతో దీన్నే పెద్ద రాఖీ గిఫ్ట్ గా చెప్పుకుంటోంది నీహారిక. నిజమే మరి. మహామహులు దిగ్గజాలు నటించిన ఇంత పెద్ద గ్రాండియర్ లో తన పాత్ర రెండు నిమిషాలే ఉన్నా ప్రపంచం మొత్తం చూసే మేకింగ్ వీడియోలో అంత చోటు ఇవ్వడం అంటే చరణ్ కు చెల్లి మీద ప్రేమ కాక మరేమిటి
Please Read Disclaimer